
'నిన్ను చూసి దేశం గర్విస్తోంది'
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ ను రెండోసారి సాధించిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ ను రెండోసారి సాధించిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. సైనా నెహ్వాల్ అద్భుత విజయం సొంతం చేసుకుందని, ఆమె సాధించినా క్రీడా విజయాలను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అపూర్వ విజయం సాధించిన భారత్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ పై సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అభినందనలు కురిపించారు.
తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్, ఆనందిబెన్ పటేల్, కేంద్ర మంత్రులు రాజ్యవర్థన్ రాథోడ్, రవిశంకర్ ప్రసాద్, ధర్మంద్ర ప్రధాన్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, హీరోయిన్ సొనాక్షి సిన్హా, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, టీమిండియా బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ తదితరులు ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. భారతీయులంతా గర్వించే విజయం సాధించినందుకు నైనాకు హ్యాట్సాఫ్ చెబుతూ అమితాబ్ ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. తనకు అభినందనలు తెలిపిన వారందరికీ సైనా నెహ్వాల్ ధన్యవాదాలు చెప్పింది.
Congratulations @NSaina for the stupendous victory. The entire nation is very proud of your sporting accomplishments.
— Narendra Modi (@narendramodi) 12 June 2016
T 2285 - @NSaina .. you continue to make us proud to be an Indian .. well done ..Champion at Australian Open ..!! pic.twitter.com/ldjUUsZSsb
— Amitabh Bachchan (@SrBachchan) 12 June 2016