
సానియా మీర్జాకు రాష్ట్రపతి అభినందనలు
యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు.
న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ఈ విజయం ద్వారా సానియా దేశం గర్వించేలా చేసిందని కొనియాడారు.
రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్లో ఈ మేరకు పేర్కొన్నారు. దీనికి ప్రతిగా సానియా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేశారు. యూఎస్ ఓపెన్లో సానియా.. బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోర్స్తో కలసి టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే.