సానియాకు రాష్ట్రపతి అభినందనలు | Pranab Mukherjee congratulates Sania Mirza for WTA win | Sakshi
Sakshi News home page

సానియాకు రాష్ట్రపతి అభినందనలు

Published Tue, Oct 28 2014 4:03 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Pranab Mukherjee congratulates Sania Mirza for WTA win

న్యూఢిల్లీ: డబ్యూటీఏ డబుల్స్ టైటిల్ గెలిచిన హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. మంగళవారం ఓ సందేశాన్ని విడుదల చేసిన ప్రణబ్.. సానియా సాధించిన ఘనత దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 'సింగపూర్ లో సానియా సాధించిన డబ్యూటీఏ డబుల్స్ టైటిల్ నిజంగా గర్వించదగింది. ఇంతటి ఘనతను మీ కుటుంబంతో కలిసి సెలిబ్రెట్ చేసుకోవడానికి దేశం మొత్తం సిద్ధంగా ఉంది' అని ప్రణబ్ తెలిపారు. మరిన్ని విజయాలను సానియా సాధించి దేశ కీర్తిని మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు.

 

జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్తో కలిసి సానియా మీర్జా ఈ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో ఈ జంట తైపీ, చైనాలకు చెందిన సు వై సై, షుయ్ పెంగ్ జంటపై 6-1, 6-0 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ ను సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement