సానియాకు ప్రధాని మోదీ అభినందనలు | Narendra Modi congratulates Sania mirza for WTA Finals triumph | Sakshi
Sakshi News home page

సానియాకు ప్రధాని మోదీ అభినందనలు

Published Mon, Oct 27 2014 10:25 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

సానియాకు ప్రధాని మోదీ అభినందనలు - Sakshi

సానియాకు ప్రధాని మోదీ అభినందనలు

డబ్ల్యుటీఏ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ సందేశం పెట్టారు. ఇది చాలా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వెంటనే సానియా కూడా ఆయనకు సమాధానం పెట్టి.. కృతజ్ఞతలు తెలిపింది. జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్తో కలిసి సానియా మీర్జా ఈ విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఫైనల్ మ్యాచ్లో ఈ జంట తైపీ, చైనాలకు చెందిన సు వై సై, షుయ్ పెంగ్ జంటపై 6-1, 6-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కారా బ్లాక్తో జత కట్టినప్పటినుంచి సానియ డబుల్స్ ప్రతిభ కూడా బాగా పెరిగింది. కేవలం గంట వ్యవధిలోనే ఫైనల్ మ్యాచ్ని సానియా - కారా జంట ముగించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement