
బీజేపీకి రాహుల్ అభినందనలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు.
మహారాష్ట్ర, హర్యానాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ ఓటమిని రాహుల్ అంగీకరించారు.