
ముంబై : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం షురూ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ గురువారం ప్రారంభించనున్నారు. ప్రచారంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారంలో పాల్గొననున్నారు.
రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు వాంగిలో మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత పతంగరావు కదమ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు, ఆ తర్వాత 1.45 గంటలకు కడేగావ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు’ అని జాతీయ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
288 అసెంబ్లీ స్థానాల్లో
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది.
మహరాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో
ఈ ఏడాది మహరాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 48 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 23 స్థానాలు,శివసేన 18 స్థానాలు,నేషనలిస్ట్ కాంగ్రెస్ 4 స్థానాలు,కాంగ్రెస్ 2,స్వాభిమాని పక్ష ఒకస్థానంలో గెలిచింది.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from his residence.
Rahul Gandhi will visit Maharashtra today, where he will hold a public meeting. pic.twitter.com/aysHPWuY9I— ANI (@ANI) September 5, 2024