
సాక్షి, అమరావతి: అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గెలుచుకున్న గురుగు హిమప్రియను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. శ్రీకాకుళం జిల్లా పొన్నం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక 2018 ఫిబ్రవరిలో జమ్మూలో జరిగిన ఉగ్రదాడిలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిందని, ఇది రాబోయే రోజుల్లో చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం అన్నారు.
చదవండి: (జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్)