Zelenskyy accused the West of cowardice: గత నెలరోజులకు పైగా రష్యా ఉక్రెయిన్‌పై పోరు సాగిస్తూనే ఉంది. రష్యా వేటిని లక్ష్యపెట్టక బాంబుల దాడులతో ఉక్రెయిన్ని అల్లకల్లోలం చేస్తోంది.ఈ నేపథ్యంలో యూఎస్ చట్ట సభ్యులతోనూ, యూరోపియన్ దేశాలకు తమకు మిలటరీ సాయం అందిచమని ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థించారు. ఈ విషయమైన జెలెన్ స్కీ మాట్లాడుతూ తమకు మరిన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు కావాలని విజ‍్క్షప్తి చేశారు. అయితే పశ్చిమ దేశాలు తమకు మిలటరీ సాయం అందించెందుకు వెనకడుగు వేస్తున్నాయని, పిరికివని ఆరోపణలు చేశారు.
అయితే యూఎస్, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కి పెద్ధ ఎత్తన మిలటరీ సాయం అందిచాయి కూడా. కానీ జెలెన్‌స్కీ అది సరిపోదని మరింత సాయం కావాలని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైరిలో బుడనోవ్, ఉక్రెయిన్‌ను రెండుగా విభజించాలని రష్యా ప్రయత్నిస్తోందని, ఉత్తర దక్షిణ కొరియాల మాదిరిగానే చేయాలని చూస్తోందని ఆరోపించారు. అంతేకాదు ష్యా ఇప్పుడు తూర్పు డోన్‌బాస్ ప్రాంతాన్ని నియంత్రించడంపైనే ప్రధాన దృష్టి పెట్టిందని, దాని ప్రధాన లక్ష్యానికి చేరుకున్న తర్వాత బలగాలు ఉపహరించి విభజన దిశగా అడుగులు వేస్తోందేమోనని ఉక్రెయిన్ భయాందోళనలో ఉంది. అయితే ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి మాత్రం ఉక్రేనియన్ల గెరిల్లా యుద్ధం అటువంటి ప్రణాళికలను నిర్వీర్యం చేస్తుందని ధీమాగా చెబుతుండటం గమనార్హం.
అంతేకాదు 2014 నుంచి రష్యా-మద్దతుగల వేర్పాటువాదులచే పాక్షికంగా నియంత్రణలో ఉన్న తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంపై మాస్కో తన దృష్టిని కేంద్రీకరించిందని ఉక్రెయిన్ పేర్కొంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దళాలను తూర్పు వైపుకు మళ్లిస్తున్నట్లు రష్యా ఉన్నత స్థాయి అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌తో చర్చల్లో, మాస్కో డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తోందని తెలపింది. అంతేగాక యుద్ధాన్ని ముగించడంపై రష్యాతో చర్చలు జరగనున్నట్లు ఉక్రేనియన్ ప్రతినిధి డేవిడ్ అరాఖమియా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
సోమవారం టర్కీలో సమావేశమవుతాయని కూడా చెప్పారు. కానీ రష్యా మాత్రం చర్చలు మంగళవారం ప్రారంభముతాయని చెప్పడం గమనార్హం. ఇంతకముందు జరిగిన చర్చలు, ఒప్పందాల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ మేరకు జెలెన్ స్కీ కూడా తన పాత పాటనే పాడుత్నున్నారు. ఈ వారం టర్కీలో జరిగే ఉక్రేనియన్-రష్యన్ చర్చలలో ఉక్రెయిన్ ప్రాధాన్యతలు "సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత" అని జెలెన్స్కీ నొక్కి చెప్పారు. తాను శాంతి కోసమే చూస్తున్నాని, ఈసారి టర్కీలో ముఖాముఖి సమావేశానికి అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
(చదవండి: అనూహ్యం.. వెనక్కి తగ్గిన జెలెన్‌స్కీ! పుతిన్ తగ్గట్లేదా?)
Comments
Please login to add a commentAdd a comment