splitting
-
బస్సుల్లో ఉమ్మివేస్తే జరిమాన.. ఆ అధికారం కండక్టర్‌కే
ముంబై: ముంబై వాసులకు రవాణా సేవలందిస్తున్న బస్సుల్లో పాన్, గుట్క, పొగాకు నమిలి ఉమ్మివేసే ప్రయాణికులకు రూ.200 జరిమానా విధించాలని సంస్ధ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జరిమానా వసూలుచేసే అధికారం బస్సు డ్రైవర్, కండక్టర్‌కు కట్టబెట్టింది. ఒకవేళ జరిమానా చెల్లించేందుకు నిరాకరించిన ప్రయాణికున్ని పోలీసులకు అప్పగించే అధికారం కూడా వారికే కట్టబెట్టింది. దీంతో ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిల్లరాయుళ్లకు ముకుతాడు వేసినట్లైంది. బెస్ట్ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో అనేక మందికి గుట్క, పాన్, సున్నం–తంబాకు (పొగాకు) నమిలే అలవాటుంది. సాధారణ (నాన్ ఏసీ) బస్సులో అయితే ఎక్కడైన బస్సు ఆగిన చోట లేదా అదను చూసుకుని కిటికిలోంచి బయటకు ఉమ్మివేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏసీ బస్సుల్లో ఇష్టమున్న చోట ఉమ్మివేయడానికి ఏ మాత్రం వీలులేకుండా పోయింది. కిటికీలు, డోర్లు అన్ని మూసి ఉంటున్నాయి. ఒకవేళ ఉమ్మి వేయాలంటే కిందికి దిగాల్సిందే. దీంతో పాన్, గుట్కా నములుతున్న ప్రయాణికులు ఎదురుగా ఉన్న సీటు కింద లేదా రెండు సీట్ల మధ్య ఖాళీగా ఉన్న స్ధలంలో మెల్లగా, ఎవరు చూడకుండా ఉమ్మి వేసి చేతులు దులుపేసుకుంటున్నారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. ఇలాంటి ప్రయాణికుల నిర్వాకంవల్ల బస్సు దుర్గంధంగా మారుతోంది. ముఖ్యంగా ఇలాంటి సీట్లవద్ద ప్రయాణికులు కూర్చోవాలంటే వెనకడుగు వేస్తున్నారు. డిపోలో ఈ మరకలను శుభ్రం చేయాలంటే పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాన్, గుట్కా తిని ఉమ్మివేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే విధుల్లో ఉన్న డ్రైవర్, కండక్టర్ రూ.200 జరిమాన వసూలు చేయనున్నారు. జరిమాన చెల్లించేందుకు నిరాకరిస్తే బస్సు వెళ్లే రూట్లో మార్గమధ్యలో ఎక్కడైన పోలీసు స్టేషన్ లేదా చౌకి ఉంటే అక్కడ ఉమ్మివేసిన వారిని అప్పగించే బాధ్యతలు సిబ్బందికి కట్టబెట్టింది. అయితే ఇలా ఇష్టమున్న చోట ఉమ్మివేసే షోకిళ్ల రాయుళ్లకు అడ్డుకట్ట వేసేందుకు, జనాలను జాగృతం చేయడానికి అన్ని బస్సుల్లో అనౌన్స్మెంట్ చేసే సిస్టంను అమలు చేయాలని బెస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కొంతమంది ప్రయాణికుల్లోనైన మార్పు వస్తుందని సంస్ధ భావిస్తోంది. -
రష్యా విభజన దిశగా యోచన...టెన్షన్లో ఉక్రెయిన్!
Zelenskyy accused the West of cowardice: గత నెలరోజులకు పైగా రష్యా ఉక్రెయిన్‌పై పోరు సాగిస్తూనే ఉంది. రష్యా వేటిని లక్ష్యపెట్టక బాంబుల దాడులతో ఉక్రెయిన్‌ని అల్లకల్లోలం చేస్తోంది.ఈ నేపథ్యంలో యూఎస్ చట్ట సభ్యులతోనూ, యూరోపియన్ దేశాలకు తమకు మిలటరీ సాయం అందిచమని ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థించారు. ఈ విషయమైన జెలెన్ స్కీ మాట్లాడుతూ తమకు మరిన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు కావాలని విజ్క్షప్తి చేశారు. అయితే పశ్చిమ దేశాలు తమకు మిలటరీ సాయం అందించెందుకు వెనకడుగు వేస్తున్నాయని, పిరికివని ఆరోపణలు చేశారు. అయితే యూఎస్, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కి పెద్ధ ఎత్తన మిలటరీ సాయం అందిచాయి కూడా. కానీ జెలెన్స్కీ అది సరిపోదని మరింత సాయం కావాలని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైరిలో బుడనోవ్, ఉక్రెయిన్ను రెండుగా విభజించాలని రష్యా ప్రయత్నిస్తోందని, ఉత్తర దక్షిణ కొరియాల మాదిరిగానే చేయాలని చూస్తోందని ఆరోపించారు. అంతేకాదు ష్యా ఇప్పుడు తూర్పు డోన్బాస్ ప్రాంతాన్ని నియంత్రించడంపైనే ప్రధాన దృష్టి పెట్టిందని, దాని ప్రధాన లక్ష్యానికి చేరుకున్న తర్వాత బలగాలు ఉపహరించి విభజన దిశగా అడుగులు వేస్తోందేమోనని ఉక్రెయిన్ భయాందోళనలో ఉంది. అయితే ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి మాత్రం ఉక్రేనియన్ల గెరిల్లా యుద్ధం అటువంటి ప్రణాళికలను నిర్వీర్యం చేస్తుందని ధీమాగా చెబుతుండటం గమనార్హం. అంతేకాదు 2014 నుంచి రష్యా-మద్దతుగల వేర్పాటువాదులచే పాక్షికంగా నియంత్రణలో ఉన్న తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంపై మాస్కో తన దృష్టిని కేంద్రీకరించిందని ఉక్రెయిన్ పేర్కొంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దళాలను తూర్పు వైపుకు మళ్లిస్తున్నట్లు రష్యా ఉన్నత స్థాయి అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌తో చర్చల్లో, మాస్కో డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తోందని తెలపింది. అంతేగాక యుద్ధాన్ని ముగించడంపై రష్యాతో చర్చలు జరగనున్నట్లు ఉక్రేనియన్ ప్రతినిధి డేవిడ్ అరాఖమియా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సోమవారం టర్కీలో సమావేశమవుతాయని కూడా చెప్పారు. కానీ రష్యా మాత్రం చర్చలు మంగళవారం ప్రారంభముతాయని చెప్పడం గమనార్హం. ఇంతకముందు జరిగిన చర్చలు, ఒప్పందాల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ మేరకు జెలెన్ స్కీ కూడా తన పాత పాటనే పాడుత్నున్నారు. ఈ వారం టర్కీలో జరిగే ఉక్రేనియన్-రష్యన్ చర్చలలో ఉక్రెయిన్ ప్రాధాన్యతలు "సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత" అని జెలెన్స్కీ నొక్కి చెప్పారు. తాను శాంతి కోసమే చూస్తున్నాని, ఈసారి టర్కీలో ముఖాముఖి సమావేశానికి అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. (చదవండి: అనూహ్యం.. వెనక్కి తగ్గిన జెలెన్స్కీ! పుతిన్ తగ్గట్లేదా?) -
రోడ్డుపై ఉమ్మిన వ్యక్తిపై కేసు నమోదు
రంగారెడ్డి, కొత్తూరు: ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, షాపింగ్‌మాల్స్, బస్టాప్‌ల వద్ద ఉమ్మివేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారి బస్టాప్ వద్ద ఉమ్మివేసిన వ్యక్తిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తితోనే ఉమ్మిపై మట్టిని పోయించారు. (తల్లి ప్రేమ) -
ఉమ్మినందుకు రూ.100 ఫైన్
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు ఇటీవలి కాలంలో వివిధ కార్యక్రమాలు చేపట్టి జరిమానాలు విధిస్తోన్న జీహెచ్ఎంసీ.. తాజాగా బుధవారం లింగంపల్లి వద్ద ఆర్టీసీ బస్‌డ్రైవర్ రోడ్డుపై ఉమ్మివేయడంతో రూ.100 జరిమానా విధించింది. కోఠి నుంచి పటాన్చెరు వెళ్తున్న కుషాయిగూడ ఆర్టీసీ డిపోబస్ (ఏపీ 28జడ్ 3676) లింగంపల్లి బస్బే వద్ద కొద్దిసేపు ఆగింది. ఈ సమయంలో బస్ డ్రైవర్ జగదీష్ రోడ్డుపై ఉమ్మివేశారు. దాంతోపాటు బస్‌లోంచి కొన్ని కాగితాలు కూడా అక్కడ వేశారు. సదరు దృశ్యాలను ఫొటోలు తీసిన జీహెచ్ఎంసీ పటాన్చెరు సర్కిల్ సిబ్బంది ఉమ్మివేశారా? అని అడగడంతో అవునని బదులివ్వడంతో రూ.100 జరిమానా వసూలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నో స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నందున ఇలాంటివి చేయరాదంటూ సదరు బస్‌బేలో ఉన్న వారందరికీ సూచించారు. తమ సిబ్బంది కొద్దిసేపటి క్రితమే శుభ్రం చేసిన ప్రాంతాన్ని ఉమ్మివేసి పాడు చేయడంతో జరిమానా విధించినట్లు శానిటరీ సూపర్వైజర్ గోపాల్‌రావు పేర్కొన్నారు. జరిమానా విధించే దృశ్యాల్ని జీహెచ్ఎంసీ పోస్ట్చే యడంతో సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌గా మారింది. దీంతోపాటు చదువుకోని వాడు రోడ్లు శుభ్రం చేస్తే.. చదువుకున్నవాడు పాడు చేస్తున్నాడని చెబుతూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. -
టీసీఎస్ బాటలో ఇన్ఫోసిస్
బెంగళూరు: ఇటీవల నిరాశాజనక ఫలితాలతో డీలా పడ్డ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థను మళ్లీ లాభాల బాటలో తీసుకెళ్లేందుకు సీఈవో విశాల్ సిక్కా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తన ప్రధాన పత్యర్థి, మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ బాటలో నడుస్తున్నారు. టీసీఎస్ ఏడు సంవత్సరాల క్రితం అమల్లోకి తెచ్చిన ప్రక్రియను ఇన్ఫోసిస్ అవలంబించబోతోంది. తన వ్యాపారాన్ని చిన్న యూనిట్లుగా విస్తరించనున్నామనే ఎత్తుగడను ప్రకటించింది ప్రాఫిట్ అండ్ లాస్ (పీఎన్ఎల్) బాధ్యతలను విడదీస్తున్నట్టు తెలిపింది. పూనే సమావేశంలో విశ్లేషకుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన విశాల్ సిక్కా ఈ మేరకు వివరణ ఇచ్చారు. వ్యాపార విభజనలో భాగంగా స్వయంప్రతిపత్తిగల యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది తమకు వ్యాప్తిని ఇస్తుందనీ, ఆయా వ్యక్తుల జవాబుదారీతనం ఇస్తుందని చెప్పారు. చిన్నచిన్న యూనిట్లుగా విభజించామని చెప్పినప్పటికీ సంఖ్యను పేర్కొనలేదు. అలాగే తరువాతితరం నాయకత్వం వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఎన్ చంద్రశేఖరన్ టీసీఎస్ సీఈవో ఉన్నప్పుడు దాదాపు ఏడు సంవత్సరాల క్రితం 2009లో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 23 మంది మినీ సీఈవో లకు బాధ్యలను అప్పగించి, వ్యాపార వృద్ధిలో టార్గెట్స్ ఇ చ్చింది. అయితే ప్రస్తుతమున్న వ్యాపారంలో అంతరాయం రాకుండా చిన్న చిన్న యూనిట్లను అనుమతినివ్వడమనే నూతన ప్రక్రియ ఇన్ఫోసిస్ వ్యాపార వృద్ధికి తోడ్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా సంస్థలో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదనీ, ఇన్ఫోసిస్ లో అట్రిషన్ ను తగ్గించేందుకు తామెన్నో చర్యలు తీసుకున్నామని, ప్రతిభావంతులైన ఉద్యోగులను గుర్తించి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నామని కూడా విశాల్ సిక్కా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.