కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. భీకర దాడులతో రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేసేందుకు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం సైతం దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి.
ఈ క్రమంలో ఉక్రెయిన్ పౌరులు తమ దేశానికి మద్దతు తెలుపుతూ వినూత్న పోరాటం చేస్తున్నారు. దూసుకువస్తున్న రష్యా బలగాలపై దాడి కోసం డ్రోన్ ద్వారా మొటటోవ్ కాక్‌టేల్ బాంబులను వదులుతున్నారు. బీరు బాటిళ్లలో నింపిన పెట్రోల్, ఇతర పదార్థాలకు నిప్పు అంటించిన తర్వాత వాటిని రష్యా ట్రూప్స్ టార్గెట్‌గా బ్లాస్ట్ చేస్తున్నారు.
మరోవైపు రష్యా బలగాలు కీవ్‌ను ముట్టడించే ప్రయత్నంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. బాంబు దాడులతో విరుచుకుపడటంతో కీవ్‌కు సమీపంలో ఉన్న గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో స్థానికులు నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఖర్కీవ్ రీజియన్‌లో ఉన్న యాట్స్‌కోవా గ్రామంలో బాంబు దాడులు జరగడంతో ఇళ్లు కాలిపోయి మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాకుండా రష్యా బలగాల దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌పై బుల్లెట్ల వర్షం కురిసింది. దీంతో అంబులెన్స్ పూర్తిగా దెబ్బతిన్నది.
The village of Yatskovka in the #Kharkiv region now looks like this. pic.twitter.com/LBS5wC8SvQ
— NEXTA (@nexta_tv) March 12, 2022
Comments
Please login to add a commentAdd a comment