గొర్రెల పథకంలో బోగస్ లీలలు
► లోకల్ పేరిట నగరవాసులకు అవకాశం
► తీగలగుట్టపల్లిలో ప్రజాప్రతినిధి అండతో అక్రమాలు
► స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి..
కరీంనగర్‌రూరల్: గొల్ల,కుర్మల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకంలో కొ ం దరు దళారులు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమాలకు తెరలేపారు. లోకల్ పేరిట నగరవా సులకు సంఘంలో సభ్యత్వం కల్పించి సబ్సిడీని కొట్టేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొందరు సభ్యులు పశుసంవర్ధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బోగస్ సభ్యుల బాగోతం వెలుగుచూసింది.
స్థానికేతరులపై ఫిర్యాదు
కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లిలో గొర్రెల కాపరుల ప్రాథమిక సహకార సంఘం లేకపోవడంతో అధి కారులు కొత్తగా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 69మంది గొల్ల, కుర్మలతో కలిసి సంఘాన్ని ప్రారంభిం చారు. ఈనెల 19న సబ్సిడీ గొర్రెల యూనిట్ల మంజూ రుకు గ్రామసభ నిర్వహించారు. 61మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 31మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అయితే స్థానికంగా ఉన్న కొందరి కి మొదటి విడతలో అవకాశం రాకపోవడంతో సంఘం లోని బోగస్ సభ్యులపై అధికారులకు ఫిర్యాదు చేశారు.
నగరవాసులకు సభ్యత్వం!
కరీంనగర్‌లోని గొల్ల, కుర్మలకు సబ్సిడీ గొర్రెల పథకంలో ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. శి వారు గ్రామమైన తీగలగుట్టపల్లి లో కొత్తగా గొర్రెలకాపరుల సం ఘాన్ని ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో నగరానికి చెందిన కొందరు యాదవులు సభ్యత్వం కోసం దళారులను ఆశ్రయించారు. స్థానిక ప్రజాప్రతినిధిని మచ్చిక చేసుకున్న వారు నగరవాసులకు తీగలగుట్టపల్లిలో ఉంటున్నట్లు లోకల్ సర్టిఫికెట్‌ను ఇప్పించి సభ్యత్వం కల్పించా రు.
కిసాన్‌నగర్, శివాజీనగర్‌కు చెందిన దాదాపు పది హేనుమంది సభ్యత్వం పొందగా వీరిలో ఓ ప్రభుత్వ ఉ ద్యోగి భార్య సైతం ఉండటం గమనార్హం. అంతేకా కు ండా తీగలగుట్టపల్లికి చేరువలో ఉండడంతో జిల్లాలో ని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు జీవనోపాధికో సం వలస వచ్చారు. గొల్ల, కుర్మలు కానప్పటికీ స్థానిక ప్ర జాప్రతినిధి చొరవతో సభ్యత్వం పొందినట్లు తెలుస్తోంది.
జాబితా ఖరారులో జాప్యం !
మండలంలోని అన్ని గ్రామాల లబ్ధిదారుల జాబితాను తయారు చేసిన అధికారులు తీగలగుట్టపల్లిలోని సంఘం సభ్యులపై ఫిర్యాదులు రావడంతో లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయలేదని తెలుస్తోంది. నగరవాసులతోపాటు వలసవాదులకు సభ్యత్వం కల్పించడంతో స్థానికులకు అన్యాయం జరిగిందని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల వివరాలపై సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.