'ఇరాక్ సమస్యను పరిష్కరించే సామర్థ్యం మాకు లేదు' | Barack Obama rules out sending American combat troops to Iraq | Sakshi
Sakshi News home page

'ఇరాక్ సమస్యను పరిష్కరించే సామర్థ్యం మాకు లేదు'

Published Fri, Jun 20 2014 9:28 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

'ఇరాక్ సమస్యను పరిష్కరించే సామర్థ్యం మాకు లేదు' - Sakshi

'ఇరాక్ సమస్యను పరిష్కరించే సామర్థ్యం మాకు లేదు'

వాషింగ్టన్: ఇస్లామిక్ మిలటెంట్లపై పోరాడేందుకు తమ దళాలు ఇరాక్ తిరిగి వెళ్లబోవని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అయితే అవసరమైన పక్షంలో నిర్దిష్ట లక్ష్యంతో కూడిన స్పష్టమైన సైనిక చర్య చేపడతామని ఇరాక్‌కు హామీ ఇచ్చారు. ఇరాకీ ప్రజలు, దేశాన్ని, అదే సమయంలో అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తోన్న ఉగ్రవాదులపై పోరాటానికి సహాయం చేస్తామని ఒబామా శుక్రవారం నాడిక్కడ విలేకరులకు చెప్పారు. గతంలో మాదిరిగా వేలాది మంది సైనికులను ఇరాక్‌కు పంపి సమస్యను అంత సులువుగా పరిష్కరించగలిగే సామర్థ్యం తమకు లేదని గురువారం నాడు ఆయన అన్నారు.

 

ఇదే ఇరాక్ పరిష్కరించుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న భద్రతా ఒప్పందం మేరకు తమకు సహాయం చేయూలని, మిలటెంట్లపై వైమానిక దాడులు నిర్వహించాలని అమెరికాకు ఇరాక్ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement