Islamic militants
-
శరణార్థులకు ట్రంప్ షాక్
అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధం ► ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులకు 90 రోజులు వీసాల జారీ నిలిపివేత ► శరణార్థుల పునరావాస కార్యక్రమం 120 రోజులు బంద్ వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చెప్పింది చెప్పినట్లు ఆచరణలో పెట్టేస్తున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకుంటామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై శనివారం సంతకం చేశారు. ఉత్తర్వు ప్రకారం అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశాన్ని నిరవధికంగా నిషేధించారు. ఇతర దేశాల శరణార్థుల్ని ఆసాంతం పరిశీలించాకే అనుమతిస్తారు. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. సిరియా వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యమిస్తారు. సంతకం చేశాక ట్రంప్ మాట్లాడారు. ‘ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకువస్తున్నాం. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము కోరుకోవడం లేదు. అమెరికాకు మద్దతిచ్చే, ప్రేమించే ప్రజలే ఇక్కడకు రావాలని కోరుకుంటున్నాం’అని ట్రంప్ పేర్కొన్నారు. 9/11 దాడులు నేర్పిన పాఠాల్ని ఎప్పుడూ మరవకూడదని చెప్పారు. ‘విదేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న అనేకమందికి ఉగ్ర నేరాల సంబంధాలపై శిక్షలు పడ్డాయి. శరణార్ధి ఒప్పందంలో భాగంగా అమెరికాలోకి ప్రవేశించిన వారికీ నేరాలతో సంబంధాలు ఉన్నాయి’ అని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నిర్ణయంపై నిరసనల వెల్లువ ట్రంప్ సంతకంపై అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పలు దేశాల అధినేతలు తీవ్రంగా స్పందించారు. డెమొక్రటిక్ సెనెటర్ కమలా హారిస్ వ్యాఖ్యానిస్తూ... ‘హోలోకాస్ట్ (మారణహోమం) మెమొరియల్ డే’ రోజున ట్రంప్ సంతకం చేశారని, ఇది ముస్లింలపై నిషేధమేనని పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం తనని కలచి వేసిందన్నారు. ‘అనేక మంది అమెరికన్లలా నేనూ వలసదారుల వారసుడినే. అందుకు గర్వపడాలి. దేశానికి ప్రమాదం తలపెట్టే వారిపై మాత్రమే దృష్టి పెట్టాలి. శరణు కోరినవారికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలి’ అని జుకర్‌బర్గ్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అమెరికాకు ప్రతిభావంతుల్ని తీసుకురావడంలో ట్రంప్ నిర్ణయం అడ్డంకులు సృష్టిస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. ట్రంప్ ఆదేశాలతో తమ కంపెనీలో కనీసం 187 మంది ఉద్యోగాలు కోల్పోతారని చెప్పారు. భారత్‌పై ప్రభావం ఉండదు ట్రంప్ విధానాలు భారత్‌లోని ఐటీ, బయోటెక్, ఫార్మా పరిశ్రమలపై ప్రభావాన్ని చూపబోవని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్ అన్నారు. భారత్‌తో వాణిజ్య తరహా దృక్పథాన్ని అమెరికా కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మాలిలో ఉగ్రదాడి
ఏడుగురి మృతి ఐదుగురు జీహాదిస్టుల హతం బమాకో: మాలిలోని సెవారే పట్టణంలో గల హోటల్ బైబ్లోస్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదులు శుక్రవారం ఉదయం పంజా విసిరారు. హోటల్లో ఐక్యరాజ్యసమితి సిబ్బందిని బందీలుగా పట్టుకున్న జీహాదిస్టులతో 24 గంటల పాటు పోరాడిన భద్రతా బలగాలు ఎట్టకేలకు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి శనివారం ఆపరేషన్ పూర్తిచేశాయి. ఈ ఉగ్రదాడిలో మొత్తం 12 మంది మరణించారు. ఉగ్రవాదుల చెర నుంచి ఐక్యరాజ్యసమితికి చెందిన నలుగురు సిబ్బందిని సైన్యం కాపాడింది. మరో ఉద్యోగి ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల్లో ఐదుగురు సైనికులు, మరో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తమకు పట్టున్న ప్రాంతాలకు దూరంగా ఉన్న సెవారే పట్టణంలో ఉగ్రవాదులు ఈ దాడికి పూనుకోవడం గమనార్హం. -
సౌదీ రాజు మృతిపై ఉగ్రవాదుల హర్షం
బీరట్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దులాజిజ్ మరణంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, మద్దతుదారులు ఆన్ లైన్ లో హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజానికి పట్టిన పీడ విరగడైందంటూ సామాజిక సంబంధాల వెబ్ సైట్లలో పోస్టులు పెట్టారు. అమెరికా జీతగాడిగా వ్యవహరించిన అబ్దుల్లాహ్ పశ్చిమాన ముస్లింల ఊచకోతకు కారణమయ్యారంటూ విరుచుకుపడ్డారు. రెండు ప్రార్థనా స్థలాలను దోచుకున్న దొంగ మరణించాడంటూ ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారుడొకరు ట్విటర్ లో పోస్టు చేశారు. అబ్దుల్లాహ్.. అమెరికా సేవకుడిగా బతికాడు, అమెరికా సేవకుడిగానే చనిపోయాడని మరొకరు పేర్కొన్నారు. దశాబ్దం క్రితం సౌదీ అరేబియాలో రాజరిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించిన అల్ -కాయిదాను అమెరికా దళాల సహాయంతో అబ్దుల్లాహ్ అణచివేశారు. -
అమాయకులపై నరమేధాన్ని సహించం
ఇరాక్‌లో అమెరికా వైమానిక దాడులకు ఒబామా సమర్థన తమ దౌత్యవేత్తలను, మైనారిటీలను రక్షిస్తామని స్పష్టీకరణ వాషింగ్టన్: ఇరాక్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లపై తమ వైమానిక దాడులు సమంజసమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ సమర్థించుకున్నారు. అమాయకులపై నరమేధం జరిగినప్పుడల్లా, అడ్డుకునేందుకు అమెరికా జోక్యం తప్పదన్నారు. దేశ ప్రజలనుద్దేశించి వారాంతపు ప్రసంగంలో ఒబామా మాట్లాడుతూ, ప్రపంచంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ అమెరికా జోక్యం చేసుకోజాలదని, అయితే, అమాయకులు నరమేధానికి గురయ్యే ఇరాక్లాంటి పరిస్థితిని మాత్రం అమెరికా చూస్తూ వదిలేయబోదని స్పష్టంచేశారు. మిలిటెంట్లను తుదముట్టించేందుకు దీర్ఘకాలంపాటు దాడులను కొనసాగిస్తామని ఒబామా ప్రకటించారు. ‘‘కేవలం కొద్ది వారాల్లో ఈ సమస్యను మనం పరిష్కరించలేం. కుర్దిస్థాన్‌లోని స్థావరాలపై ఈ వారంలో మొదలైన మా దాడులు నెలలపాటు కొనసాగుతాయి’’ అని ఒబామా అన్నారు. అమెరికా సైన్యంతోకాకుండా ఇరాక్‌లో సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మిలిటెంట్ల ఆగడాలను సమర్ధంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు. సంజాన్ పర్వతంపై తలదాచుకున్న మైనారిటీలను మిలిటెంట్ల దాడుల నుంచి తప్పక రక్షిస్తామన్నారు. వీరి రక్షణ కోసం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌లు తమ వంతు సాయం చేస్తామని అంగీకరించారని ఒబామా తెలిపారు. ఇరాక్‌లోని తమ దౌత్యవేత్తలు, సైనిక సలహాదారులు, మతపరమైన మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్టు ఒబామా తెలిపారు. మైనారిటీలకు తాము మానవతాపరమైన సాయం కొనసాగిస్తామన్నారు. ఇరాక్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించిన మిలిటెంట్లు మైనారిటీలపట్ల కిరాతకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మైనారిటీ వర్గాల్లోని పురుషులను హతమారుస్తూ, వారి కుటుంబసభ్యులను నిర్బంధిస్తూ,, మహిళలను బానిసలుగా చేస్తూ మిలిటెంట్లు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఒబామా ఆరోపించారు. మిలిటెంట్లు లక్ష్యంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో సైనిక దాడులు జరుపుతామన్నారు. మిలిటెంట్ల ఆగడాలకు భీతిల్లిన వేలాదిమంది యాజిదీ మైనారిటీలు ఉత్తర ఇరాక్‌లోని సింజాన్ పర్వతంపై తలదాచుకుంటూ తిండినీరులేక ఇబ్బం దులు పడుతున్నదశలో మిలిటెంట్లపై వైమానిక దాడులకు ఒబామా గురువారం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. కాగా, అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో మిలిటెంట్ల స్థావరాలపై దాడులకు ఇరాక్ ఫెడరల్ బలగాలు, కుర్దు సైనికులు కూడా సిద్ధమయ్యారు. -
విదేశీ విమానాశ్రయాల్లో అమెరికా తనిఖీలు
సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర పరికరాల సోదాపై ప్రత్యేక దృష్టి వాషింగ్టన్: విమానాశ్రయాల్లో తనిఖీని కూడా తప్పించుకోగలిగే సరికొత్త బాంబులను సిరియా, యెమెన్ దేశాల ఇస్లామ్ మిలిటెంట్లు తయారుచేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అమెరికా మరింత అప్రమత్తమైంది. అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది. పవర్ ఆన్చేయని సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విమానాల్లో అనుమతించబోమని, సదరు ఎలెక్ట్రానిక్ పరికరాలు కలిగిఉంటే, విమానం ఎక్కే ముందుగా మరింత నిశితంగా తనిఖీలకు సిద్ధపడాలని అమెరికా స్పష్టంచేసింది. తమతో తీసుకెళ్లే ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేస్తున్నవేనని, అవి పేలుడు వస్తువులు కాదని రుజువు చేసుకునేందుకు వీలుగా, ప్రయాణికులు వాటిని ఆన్‌చేసి ఉంచవలసిందిగా విదేశాల విమానాశ్రయాల్లోని తనిఖీ అధికారులు కోరతారని అమెరికా రవాణా భద్రతా శాఖ పరిపాలనా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. చార్జింగ్లేని ఎలక్ట్రానిక్ పరికరాలతో విమానంలో ప్రయాణానికి అనుమతించబోమని కూడా స్పష్టంచేసింది. -
'ఇరాక్ సమస్యను పరిష్కరించే సామర్థ్యం మాకు లేదు'
వాషింగ్టన్: ఇస్లామిక్ మిలటెంట్లపై పోరాడేందుకు తమ దళాలు ఇరాక్ తిరిగి వెళ్లబోవని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అయితే అవసరమైన పక్షంలో నిర్దిష్ట లక్ష్యంతో కూడిన స్పష్టమైన సైనిక చర్య చేపడతామని ఇరాక్‌కు హామీ ఇచ్చారు. ఇరాకీ ప్రజలు, దేశాన్ని, అదే సమయంలో అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తోన్న ఉగ్రవాదులపై పోరాటానికి సహాయం చేస్తామని ఒబామా శుక్రవారం నాడిక్కడ విలేకరులకు చెప్పారు. గతంలో మాదిరిగా వేలాది మంది సైనికులను ఇరాక్‌కు పంపి సమస్యను అంత సులువుగా పరిష్కరించగలిగే సామర్థ్యం తమకు లేదని గురువారం నాడు ఆయన అన్నారు. ఇదే ఇరాక్ పరిష్కరించుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న భద్రతా ఒప్పందం మేరకు తమకు సహాయం చేయూలని, మిలటెంట్లపై వైమానిక దాడులు నిర్వహించాలని అమెరికాకు ఇరాక్ విజ్ఞప్తి చేసింది.