ఏడుగురి మృతి ఐదుగురు జీహాదిస్టుల హతం
బమాకో: మాలిలోని సెవారే పట్టణంలో గల హోటల్ బైబ్లోస్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదులు శుక్రవారం ఉదయం పంజా విసిరారు. హోటల్‌లో ఐక్యరాజ్యసమితి సిబ్బందిని బందీలుగా పట్టుకున్న జీహాదిస్టులతో 24 గంటల పాటు పోరాడిన భద్రతా బలగాలు ఎట్టకేలకు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి శనివారం ఆపరేషన్ పూర్తిచేశాయి.
ఈ ఉగ్రదాడిలో మొత్తం 12 మంది మరణించారు. ఉగ్రవాదుల చెర నుంచి ఐక్యరాజ్యసమితికి చెందిన నలుగురు సిబ్బందిని సైన్యం కాపాడింది. మరో ఉద్యోగి ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల్లో ఐదుగురు సైనికులు, మరో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తమకు పట్టున్న ప్రాంతాలకు దూరంగా ఉన్న సెవారే పట్టణంలో ఉగ్రవాదులు ఈ దాడికి పూనుకోవడం గమనార్హం.
మాలిలో ఉగ్రదాడి
Published Sun, Aug 9 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM
Advertisement