సౌదీ రాజు మృతిపై ఉగ్రవాదుల హర్షం | Islamic militants celebrate Saudi king's death online | Sakshi
Sakshi News home page

సౌదీ రాజు మృతిపై ఉగ్రవాదుల హర్షం

Published Fri, Jan 23 2015 7:50 PM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాహ్(ఫైల్) - Sakshi

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాహ్(ఫైల్)

బీరట్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దులాజిజ్ మరణంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, మద్దతుదారులు ఆన్ లైన్ లో హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజానికి పట్టిన పీడ విరగడైందంటూ సామాజిక సంబంధాల వెబ్ సైట్లలో పోస్టులు పెట్టారు. అమెరికా జీతగాడిగా వ్యవహరించిన అబ్దుల్లాహ్ పశ్చిమాన ముస్లింల ఊచకోతకు కారణమయ్యారంటూ విరుచుకుపడ్డారు.

రెండు ప్రార్థనా స్థలాలను దోచుకున్న దొంగ మరణించాడంటూ ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారుడొకరు ట్విటర్ లో పోస్టు చేశారు. అబ్దుల్లాహ్.. అమెరికా సేవకుడిగా బతికాడు, అమెరికా సేవకుడిగానే చనిపోయాడని మరొకరు పేర్కొన్నారు. దశాబ్దం క్రితం సౌదీ అరేబియాలో రాజరిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించిన అల్ -కాయిదాను అమెరికా దళాల సహాయంతో అబ్దుల్లాహ్ అణచివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement