photo credit: AP
వాషింగ్టన్: ఇరాక్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా దాడులకు దిగింది. ఉత్తర ఇరాక్‌లో మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడడంతో అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు హెజ్బొల్లాపై దాడులకు దిగినట్లు దేశ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.
‘ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూపునకు చెందిన మూడు స్థావరాలపై ఇరాక్‌లోని మా బలగాలు దాడులు జరిపాయి. ఖచ్చితమైన లక్ష్యాలను ఎంచుకుని వరుస దాడులు జరిపాం. ఇరాక్, సిరియాల్లో మా బలగాలపై ఇటీవల మిలిటెంట్లు తరచుగా దాడులు జరుపతున్నారు. దీనికి ప్రతిగా అధ్యక్షుడి ఆదేశాలతో మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశాం’ అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్న హమాస్‌తో పాటు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్న హౌతీ మిలిటెంట్లు, ఇరాక్‌లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్ల వెనుక ఇరానే ఉందని అమెరికా ఆరోపిస్తుండటం గమనార్హం.
ఇదీచదవండి..అమెరికా ఎన్నికలు.. ట్రంప్ క్యాంపెయిన్‌లో ఆమె కీ రోల్ !
Comments
Please login to add a commentAdd a comment