
ప్రముఖ వైద్యురాలు అనారోగ్యంగా ఉన్న తల్లి కోసం వచ్చి రష్యా బలగాల చేతిలో హతమైంది.
Ukrainian woman ventured To find medicines: ఉక్రెయిన్ పై దురాక్రమణ చేసే క్రమంలో రష్యా రోజుకో రకమైన యుద్ధ వ్యూహాంతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంది. గత 18 రోజులుగా ఉక్రెయిన్ పై నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. యుద్ధోన్మాదంతో అమాయాక పౌరులను, మహిళలు, చిన్నారులను పొట్టన పెట్టకుంది. రోజులు గడుస్తున్న కొద్ది యుద్ధం తీవ్రతరం మవుతుందే గానీ ఆగే సూచనలు ఏ మాత్రం కనిపించడంలేదు. ఆ క్రమంలో ఒక ప్రముఖ వైద్యురాలు అనారోగ్యంగా ఉన్న తన తల్లి కోసం బయటకు రావడమే ఆమె పాలిట మృత్యువుగా మారింది.
ఆమె యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఎయిడ్)తో కలసి పనిచేసిన ప్రముఖ వైద్యురాలు వలేరియా మక్సేట్స్కా. నిజానికి 31 ఏళ్ల మక్సేట్స్కా ఆమె ఈ యుద్ధం మొదలైనప్పుడే వెళ్లిపోవాలి కానీ ఈ యుద్ధ సమయంలో గాయపడుతున్న వారికి సాయం చేసేందుకు ఆమె ఉండిపోయారు. ఎప్పుడైతే యుద్ధ తీవ్రతరమై ఆసుపత్రిలపై కూడా దాడి చేయడం మొదలైందో అప్పుడే తన తల్లి చికిత్స నిమిత్తం ఆమె దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది.
రష్యా బలగాలు ఆమె డోనెట్స్క్‌లోని షెల్లింగ్ పై దాడి చేసినప్పుడూ ఆమె తప్పించుకుని ఉక్రెయిన్ రాజధాని కైవకి వచ్చింది. కానీ ఇక్కడ ఆమె తప్పించుకోలేకపోయింది. 2014లో క్రిమియన్ ద్వీపకల్పంపై రష్యా దాడి చేసినప్పటి నుంచి ఆమె మానవతావాద ప్రతిస్పందనలో భాగంగా పనిచేశారని యూఎస్‌ఎయిడ్ అడ్మినిస్ట్రేటర్ సమంతా పవర్ అన్నారు. ఆమె తన తల్లి మందుల కోసం డ్రైవర్ తీసుకుని తల్లితో సహా కైవ్ సమీపంలోని వచ్చనిప్పుడు రష్యాన్ యుద్ధ ట్యాంకుల దాడిలో మరణించినట్లు ధృవీకరించారు. ఈ దాడిలో మక్సేట్స్కా, ఆమె తల్లి, డ్రైవర్ అక్కడికక్కడే మరణించారని తెలిపారు.
(చదవండి: రష్యా రాక్షస విధ్వంసం..చిన్నారులు, మహిళల పై కాల్పుల మోత)