కీవ్: రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని స్వాధీనం చేసుకునే దిశగా జరిపిన దాడుల్లో విఫలమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో మాత్రం పట్టు సాధించగలిగింది. గత నెలలో రష్యా తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులు హోరాహోరీగా సాగించి మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే. రష్యా ఇప్పుడూ తూర్పు ఉక్రెయిన్‌లోని మరో నగరమైన సెవెరోడోనెట్స్‌క్‌ని స్వాధీనం చేసుకునే దిశగా దాడులు నిర్వహించింది.
ఈ మేరకు రష్యా బలగాలు వందలాది మంది పౌరులు ఆశ్రయం పొందుతున్న అజోట్ కెమికల్ ప్లాంట్‌పై పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో వందలాదిమంది పౌరులు, సైనికులు తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా మద్ధతు గల వేర్పాటువాద ప్రాంతంలో చివరి వంతెన కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. రష్యా సేనలు ఇప్పటి వరకు డోనెట్స్ నదిపై నిర్మించిన మూడు వంతెనలు ధ్వంసం చేశారని అన్నారు. ఈ చివరి వంతెన కూడా ధ్వంసం కావడంతో ఉక్రెయిన్ బలగాలు ఆ నగరంలోకి ప్రవేశించడం అసాధ్యంగా ఉందన్నారు.
దీంతో రష్యా సేనలు మీకు వేరే మార్గంలేదు లొంగిపొండి లేదా చనిపోండి అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు సెవెరోడోనెట్స్‌క్‌లో దాదాపు 70 శాతం రష్యా నియంత్రణలోనే ఉందన్నారు. అదీగాక తూర్పు డాన్‌బాస్ ప్రాంతంపై నియంత్రణే ఉక్రెయిన్ యుద్ధ భవిష్యత్తుకు కీలకమని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడోనెట్స్‌క్‌లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సేనలను చాలా వరకు నియంత్రించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సెవెరోడోనెట్స్‌క్‌ను రక్షించడంలో సహాయపడటానికి ఆయుధాలను పంపించండంటూ పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు.
(చదవండి: మరో 4 నెలలు?)
Comments
Please login to add a commentAdd a comment