chemical plant
-
Russia-Ukraine war: శరణమో, మరణమో
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడొనెట్స్క్ నగరంలో మారియూపోల్ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్ ప్లాంట్‌లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. డోన్బాస్లో భారీ సంఖ్యలో ఉక్రెయిన్ ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సోమవారం తెలియజేసింది. వుహ్లెదర్ థర్మల్ పవర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. 40,000 మంది రష్యా జవాన్లు బలి! జూన్ ఆఖరు నాటికి రష్యా సైన్యం 40,000 మంది జవాన్లను కోల్పోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. డోన్బాస్లోకి రిజర్వు బలగాలను దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు. యుద్ధం మరో రెండేళ్లపాటు కొనసాగుతుందని రష్యా మాజీ ప్రధాని కాస్యనోవ్ అంచనా వేశారు. 20 మంది మహిళలపై వేధింపులు: అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారన్న ఆనుమానంతో రష్యా పోలీసులు 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని, అమానవీయంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ రష్యాలోని నిజ్నీ నొవోగొరోడ్లో ఈ దారుణం జరిగిందని బాధితుల తరపు న్యాయవాది చెప్పారు. రష్యా పోలీసులు 18 నుంచి 27 ఏళ్ల వయసున్న 20 మంది మహిళలను వివస్త్రలను చేసి, ఐదుసార్లు స్క్వాట్స్ చేయించారని తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఫోన్లలో వీడియో తీశారని పేర్కొన్నారు. -
ఉక్రెయిన్ యుద్ధం: పట్టుబిగిస్తున్న రష్యా
కీవ్: రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని స్వాధీనం చేసుకునే దిశగా జరిపిన దాడుల్లో విఫలమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో మాత్రం పట్టు సాధించగలిగింది. గత నెలలో రష్యా తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులు హోరాహోరీగా సాగించి మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నసంగతి తెలిసిందే. రష్యా ఇప్పుడూ తూర్పు ఉక్రెయిన్‌లోని మరో నగరమైన సెవెరోడోనెట్స్క్ని స్వాధీనం చేసుకునే దిశగా దాడులు నిర్వహించింది. ఈ మేరకు రష్యా బలగాలు వందలాది మంది పౌరులు ఆశ్రయం పొందుతున్న అజోట్ కెమికల్ ప్లాంట్‌పై పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో వందలాదిమంది పౌరులు, సైనికులు తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా మద్ధతు గల వేర్పాటువాద ప్రాంతంలో చివరి వంతెన కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. రష్యా సేనలు ఇప్పటి వరకు డోనెట్స్ నదిపై నిర్మించిన మూడు వంతెనలు ధ్వంసం చేశారని అన్నారు. ఈ చివరి వంతెన కూడా ధ్వంసం కావడంతో ఉక్రెయిన్ బలగాలు ఆ నగరంలోకి ప్రవేశించడం అసాధ్యంగా ఉందన్నారు. దీంతో రష్యా సేనలు మీకు వేరే మార్గంలేదు లొంగిపొండి లేదా చనిపోండి అంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు సెవెరోడోనెట్స్క్లో దాదాపు 70 శాతం రష్యా నియంత్రణలోనే ఉందన్నారు. అదీగాక తూర్పు డాన్బాస్ ప్రాంతంపై నియంత్రణే ఉక్రెయిన్ యుద్ధ భవిష్యత్తుకు కీలకమని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడోనెట్స్క్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సేనలను చాలా వరకు నియంత్రించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సెవెరోడోనెట్స్క్ను రక్షించడంలో సహాయపడటానికి ఆయుధాలను పంపించండంటూ పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు. (చదవండి: మరో 4 నెలలు?) -
భారీ అగ్ని ప్రమాదం; 23 మంది మృతి
బీజింగ్: చైనాలో ఓ రసాయన కంపెనీ వెలుపల భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదకర రసాయనాలు తరలిస్తోన్న ట్రక్కు పేలి కనీసం 23 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని క్యోడోంగ్ జిల్లా జాంగ్జియకోలోని హెబీ షెంగువా రసాయన పరిశ్రమ వెలుపల బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కెమికల్ ప్లాంట్ నుంచి ఓ ప్రమాదకర రసాయనాన్ని బయటకు తరలించే క్రమంలో భాగంగా ట్రక్కు ట్యాంకర్లో నింపారు. అనంతరం ట్రక్కు ప్లాంటు నుంచి బయటకు వెళ్లగానే పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఈ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో అక్కడే ఉన్న సుమారు 50 ట్రక్కులు పేలిపోయాయి. ఈ ఘటనలో కనీసం 23 మంది మంటల్లో చిక్కుకుని మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చింది. అత్యవసర విపత్తు నిర్వహణ సహాయమంత్రి ఫు జియాన్హువా ప్రమాదం జరిగిన ప్లాంటును సందర్శించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సరిగ్గా ఐదు రోజుల క్రితం చైనాలోని జిలిన్ ప్రాంతంలో ఓ గిడ్డంగిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. -
బతుకు ఛిద్రం
► రసాయన కర్మాగారంలో భారీ విస్ఫోటనం ►నిర్లక్ష్యానికి భారీ మూల్యం ►17 మందిని మింగేసిన పేలుడు ►ఛిద్రమైన మృతదేహాలు ►ఆందోళనలో తురైయూర్ గ్రామాల ప్రజలు ►కర్మాగారానికి తాళం వేయాలని డిమాండ్ తిరుచ్చి తురైయూర్ మురుగంపట్టిలోని రసాయన కర్మాగారంలో చోటుచేసుకున్న విస్ఫోటనం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో పదిహేడు మంది విగతజీవులయ్యారు. గుర్తు పట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలను చూసి బంధువులు.. పరిసర గ్రామాల వాసులు గుండెలు బాదుకున్నారు. రసాయన కర్మాగారానికి తాళం వేయాల్సిందేనని ఉద్యమం సాగుతూ వచ్చినా పాలకులు పెడచెవిన పెట్టడం వల్లే ప్రస్తుతం ఇలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, చెన్నై సాక్షి, చెన్నై: తిరుచ్చి జిల్లా తురైయూర్ మురుగం పట్టిలో సేలం జిల్లా ఆత్తూరుకు చెందిన రామలింగం వెట్రివేల్ కెమికల్స్ అండ్ ఎక్స్‌ప్లోజర్స్ పేరిట పరిశ్రమను గతంలో నెలకొల్పాడు. ఇక్కడ మురుగంపట్టి, కొప్పలం, వలయపట్టి, వయలచెట్టి పాళయం, వాషర్పేట, భారత్ పేట పరిసరాల్లోని పది గ్రామాలకు చెందిన వంద మంది వరకు పనిచేస్తున్నారు. ఇక్కడ బొగ్గు గనుల తవ్వకాలు, కొండల్ని పిప్పిం చేయడం తదితర పేలుడుకు ఉపయోగించే రసాయనాల మిశ్రమం, ముడి సరకుల ఉత్పత్తి ఇక్కడ సాగుతుండడంతో తమకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని, ఆ కర్మాగారానికి తాళం వేయాలని పదేపదే పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. ఎన్నో పోరాటాలు చేసినా, పట్టించుకున్న వాళ్లు లేరు. ఈ పరిశ్రమ రూపంలో ఏదో ఒక రూపంలో తమకు పెను ప్రమాదం తప్పదన్న పదే పదే అక్కడి ప్రజలు అధికారుల వద్ద వాపోతూ వచ్చారు. వారి గోడును పట్టించుకునే వాళ్లు లేని దృష్ట్యా, గురువారం చోటు చేసుకున్న విస్పోటనంతో భారీ మూల్యంగా పదిేహహేడు మంది ప్రాణాల్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. విస్పోటనం : ఐదు యూనిట్లుగా ఇక్కడ ముడి సరుకుల ఉత్పత్తి ప్రక్రియ సాగుతోంది. గురువారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆ కర్మాగారం నుంచి రాత్రి షిఫ్ట్‌లో ఉన్న పదిహేను మంది బయటకు వచ్చారు. వీరికి బదులుగా ఇరవై మంది ఉదయాన్నే పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఏమైందో ఏమోగానీ రెండో యూనిట్లో ఒక్కసారిగా భారీ శబ్దం. ఈ శబ్దం దాటికి ఆ పరిసరాలు దద్దరిల్లారుు. పక్కనే ఉన్న భారీ ప్లాంట్ చెల్లాచెదరు కావడంతో, కొంత మేరకు భవనాలు నేలమట్టం కావడం, దట్టమైన పొగ, దగ్గరకు వెళ్ల లేనంతంగా మంటలు, కళ్లు మండే విధంగా, పీల్చడానికి వీలు లేని రీతిలో రసాయనాల వాసన ఆ పరిసర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేశారుు. లోపల ఉన్న వారి పరిస్థితి ఏమిటో అన్న ఉత్కంఠ. భయం..భయంగా కొందరు దగ్గరగా వెళ్లేందుకు సాహసించారు. కొందరు గాయాలతో ఆ పొగల నుంచి బయటకు పరుగులు తీయడంతో వారిని రక్షించేందుకు స్థానికులు తీవ్రంగానే ప్రయత్నించి ఆసుపత్రులకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్: ఎనిమిది గంటల సమయంలో సమాచారం అందుకున్న అక్కడి డీఎంకే ఎమ్మెల్యే స్టాలిన్‌కుమార్ తిరుచ్చి కలెక్టర్ పళని స్వామి, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం ఆరేడు అగ్నిమాపక వాహనాలు, పది అంబులెన్సలకు సంఘటన స్థలానికి చేరుకున్నా, సహాయక చర్యలకు వర్షం, దట్టమైన రసాయన పొగ అడ్డు రావడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఘటన జరిగిన మూడు గంటల అనంతరం పూర్తి స్థారుులో సహాయకాల్లో మునిగారు. ఐదుగంటల పాటు శ్రమించి, రసాయనాల పొగ, మండుతున్న యాసిడ్‌ను కట్టడి చేశారు. లోపలకు అడుగులు పెట్టగానే, ఛిద్రమైన రెండు మృత దేహాలు బయట పడడంతో, మృతుల సంఖ్య మరీ ఎక్కువగానే ఉండొచ్చన్న ఆందోళన బయలు దేరింది. పెద్ద సంఖ్యలో ఆ పరిసర వాసులు అక్కడికి చేరుకోవడంతో వారిని కట్టడి చేయడం తలకు మించిన భారంగా మారింది. భారీ మూల్యం : ఆ పరిశ్రమకు ఎప్పుడో తాళం వేసి ఉంటే, ఇప్పుడు భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుని ఉండేది కాదు అని ఆ పరిసర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిశ్రమలో విధులకు హాజరైన వారి వివరాల మేరకు మృతి చెందిన వారిలో మురుగం పట్టికి చెందిన సుబ్రమణియన్, రవీంద్రన్, భూపతి, ప్రవీణ్, మురుగేషన్, భారత్ పేటకు చెందిన రవిచంద్రన్, నకులన్, సిరుదాంపట్టికి చెందిన లారెన్స, కోనురు పట్టికి చెందిన సెల్వకుమార్, సెంగట్టూరుకు చెందిన కార్తీకేయన్, మయల చెట్టి పాళయంకు చెందిన రాజ, ప్రకాష్, ప్రవీణ్, నగనలూరుకు చెందిన శ్రీనివాసన్, సంపత్ ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలన్నీ ఛిద్రమై ఉండడంతో, గుర్తించడం కష్టతరంగా మారింది. తమ వాళ్ల శరీరాలు గుర్తు పట్టనంతగా పడి ఉండడంతో బాధిత కుటుంబాల రోదనలు వర్ణణాతీతం. తాళం వేసి తీరుతాం : ఘటన సమాచారంతో మంత్రి కడంబూరు రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల్ని ఓదార్చారు. ఈ సమయంలో బాధితులు ఆ పరిశ్రమకు శాశ్వతంగా తాళం వేయాల్సిందేనని పట్టుబడుతూ జాతీయ రహదారి మీదకు చేరారు.వారిని బుజ్జగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు మంత్రి కడంబూరు రాజుజోక్యం చేసుకుని, ప్రమాదం జరిగిఉన్న దృష్ట్యా, అందుకు తగ్గ విచారణ సాగాల్సి ఉందని, రెండు మూడు రోజుల్లో ఈ పరిశ్రమకు శాశ్వతంగా తాళం వేస్తామని హామీ ఇవ్వడంతో ఆ పరిసర గ్రామాల ప్రజలు శాంతించారు. ఇక, ఆ పరిశ్రమ యజమాని రామలింగం, మేనేజర్ విజయన్‌ల వద్ద ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ పరిశ్రమలో చిన్న పాటి సర్‌ూక్యట్ ఏర్పడ్డా, ఇతర ప్లాంట్లకు ఎలాంటి ప్రమాదాలు వాటిళ్లకుండా గట్టి చర్యలు తీసుకుని ఉన్న దృష్ట్యా, మరింతగా భారీ ప్రమాదం తప్పినట్టు అయింది. -
మెక్సికోలో భారీ పేలుడు: ముగ్గురు మృతి
మెక్సికో : మెక్సికోలోని తీర రాష్ట్రం వెరాక్రూజ్లో పెట్రో కెమికల్ ప్లాంట్‌లో బుధవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 136 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 88 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం బుధవారం చోటు చేసుకుంది. -
కెమికల్ ఫ్యాక్టరీపై గ్రామస్తుల దాడి
నెల్లూరు: తమ గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెడుతున్న ఓ ఫ్యాక్టరీ పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలకేంద్రం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. మండల కేంద్రానికి సమీపంలోని న్యూట్రస్ స్పెషాలిటీ కార్యలయం అద్దాలు ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు దాడిలో పాల్గోన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.