► రసాయన కర్మాగారంలో భారీ విస్ఫోటనం
►నిర్లక్ష్యానికి భారీ మూల్యం
►17 మందిని మింగేసిన పేలుడు
►ఛిద్రమైన మృతదేహాలు
►ఆందోళనలో తురైయూర్ గ్రామాల ప్రజలు
►కర్మాగారానికి తాళం వేయాలని డిమాండ్
తిరుచ్చి తురైయూర్ మురుగంపట్టిలోని రసాయన కర్మాగారంలో చోటుచేసుకున్న విస్ఫోటనం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో పదిహేడు మంది విగతజీవులయ్యారు. గుర్తు పట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలను చూసి బంధువులు.. పరిసర గ్రామాల వాసులు గుండెలు బాదుకున్నారు. రసాయన కర్మాగారానికి తాళం వేయాల్సిందేనని ఉద్యమం సాగుతూ వచ్చినా పాలకులు పెడచెవిన పెట్టడం వల్లే ప్రస్తుతం ఇలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, చెన్నై
సాక్షి, చెన్నై:
తిరుచ్చి జిల్లా తురైయూర్ మురుగం పట్టిలో సేలం జిల్లా ఆత్తూరుకు చెందిన రామలింగం వెట్రివేల్ కెమికల్స్ అండ్ ఎక్స్‌ప్లోజర్స్ పేరిట పరిశ్రమను గతంలో నెలకొల్పాడు. ఇక్కడ మురుగంపట్టి, కొప్పలం, వలయపట్టి, వయలచెట్టి పాళయం, వాషర్‌పేట, భారత్ పేట పరిసరాల్లోని పది గ్రామాలకు చెందిన వంద మంది వరకు పనిచేస్తున్నారు. ఇక్కడ బొగ్గు గనుల తవ్వకాలు, కొండల్ని పిప్పిం చేయడం తదితర పేలుడుకు ఉపయోగించే రసాయనాల మిశ్రమం, ముడి సరకుల ఉత్పత్తి ఇక్కడ సాగుతుండడంతో తమకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని, ఆ కర్మాగారానికి తాళం వేయాలని పదేపదే పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం.
ఎన్నో పోరాటాలు చేసినా, పట్టించుకున్న వాళ్లు లేరు. ఈ పరిశ్రమ రూపంలో ఏదో ఒక రూపంలో తమకు పెను ప్రమాదం తప్పదన్న పదే పదే అక్కడి ప్రజలు అధికారుల వద్ద వాపోతూ వచ్చారు. వారి గోడును పట్టించుకునే వాళ్లు లేని దృష్ట్యా, గురువారం చోటు చేసుకున్న విస్పోటనంతో భారీ మూల్యంగా పదిేహహేడు మంది ప్రాణాల్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.
విస్పోటనం : ఐదు యూనిట్లుగా ఇక్కడ ముడి సరుకుల ఉత్పత్తి ప్రక్రియ సాగుతోంది. గురువారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆ కర్మాగారం నుంచి రాత్రి షిఫ్ట్‌లో ఉన్న పదిహేను మంది బయటకు వచ్చారు. వీరికి బదులుగా ఇరవై మంది ఉదయాన్నే పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఏమైందో ఏమోగానీ రెండో యూనిట్‌లో ఒక్కసారిగా భారీ శబ్దం. ఈ శబ్దం దాటికి ఆ పరిసరాలు దద్దరిల్లారుు. పక్కనే ఉన్న భారీ ప్లాంట్ చెల్లాచెదరు కావడంతో, కొంత మేరకు భవనాలు నేలమట్టం కావడం, దట్టమైన పొగ, దగ్గరకు వెళ్ల లేనంతంగా మంటలు, కళ్లు మండే విధంగా, పీల్చడానికి వీలు లేని రీతిలో రసాయనాల వాసన ఆ పరిసర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేశారుు.
లోపల ఉన్న వారి పరిస్థితి ఏమిటో అన్న ఉత్కంఠ. భయం..భయంగా కొందరు దగ్గరగా వెళ్లేందుకు సాహసించారు. కొందరు గాయాలతో ఆ పొగల నుంచి బయటకు పరుగులు తీయడంతో వారిని రక్షించేందుకు స్థానికులు తీవ్రంగానే ప్రయత్నించి ఆసుపత్రులకు తరలించారు.
రెస్క్యూ ఆపరేషన్: ఎనిమిది గంటల సమయంలో సమాచారం అందుకున్న అక్కడి డీఎంకే ఎమ్మెల్యే స్టాలిన్‌కుమార్ తిరుచ్చి కలెక్టర్ పళని స్వామి, ఎస్‌పీ సెంథిల్‌కుమార్‌ల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం ఆరేడు అగ్నిమాపక వాహనాలు, పది అంబులెన్‌సలకు సంఘటన స్థలానికి చేరుకున్నా, సహాయక చర్యలకు వర్షం, దట్టమైన రసాయన పొగ అడ్డు రావడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఘటన జరిగిన మూడు గంటల అనంతరం పూర్తి స్థారుులో సహాయకాల్లో మునిగారు. ఐదుగంటల పాటు శ్రమించి, రసాయనాల పొగ, మండుతున్న యాసిడ్‌ను కట్టడి చేశారు. లోపలకు అడుగులు పెట్టగానే, ఛిద్రమైన రెండు మృత దేహాలు బయట పడడంతో, మృతుల సంఖ్య మరీ ఎక్కువగానే ఉండొచ్చన్న ఆందోళన బయలు దేరింది. పెద్ద సంఖ్యలో ఆ పరిసర వాసులు అక్కడికి చేరుకోవడంతో వారిని కట్టడి చేయడం తలకు మించిన భారంగా మారింది.
భారీ మూల్యం : ఆ పరిశ్రమకు ఎప్పుడో తాళం వేసి ఉంటే, ఇప్పుడు భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుని ఉండేది కాదు అని ఆ పరిసర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిశ్రమలో విధులకు హాజరైన వారి వివరాల మేరకు మృతి చెందిన వారిలో మురుగం పట్టికి చెందిన సుబ్రమణియన్, రవీంద్రన్, భూపతి, ప్రవీణ్, మురుగేషన్, భారత్ పేటకు చెందిన రవిచంద్రన్, నకులన్, సిరుదాంపట్టికి చెందిన లారెన్‌స, కోనురు పట్టికి చెందిన సెల్వకుమార్, సెంగట్టూరుకు చెందిన కార్తీకేయన్, మయల చెట్టి పాళయంకు చెందిన రాజ, ప్రకాష్, ప్రవీణ్, నగనలూరుకు చెందిన శ్రీనివాసన్, సంపత్ ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలన్నీ ఛిద్రమై ఉండడంతో, గుర్తించడం కష్టతరంగా మారింది. తమ వాళ్ల శరీరాలు గుర్తు పట్టనంతగా పడి ఉండడంతో బాధిత కుటుంబాల రోదనలు వర్ణణాతీతం.
తాళం వేసి తీరుతాం : ఘటన సమాచారంతో మంత్రి కడంబూరు రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల్ని ఓదార్చారు. ఈ సమయంలో బాధితులు ఆ పరిశ్రమకు శాశ్వతంగా తాళం వేయాల్సిందేనని పట్టుబడుతూ జాతీయ రహదారి మీదకు చేరారు.వారిని బుజ్జగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు మంత్రి కడంబూరు రాజుజోక్యం చేసుకుని, ప్రమాదం జరిగిఉన్న దృష్ట్యా, అందుకు తగ్గ విచారణ సాగాల్సి ఉందని, రెండు మూడు రోజుల్లో ఈ పరిశ్రమకు శాశ్వతంగా తాళం వేస్తామని హామీ ఇవ్వడంతో ఆ పరిసర గ్రామాల ప్రజలు శాంతించారు. ఇక, ఆ పరిశ్రమ యజమాని రామలింగం, మేనేజర్ విజయన్‌ల వద్ద ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ పరిశ్రమలో చిన్న పాటి సర్‌ూక్యట్ ఏర్పడ్డా, ఇతర ప్లాంట్‌లకు ఎలాంటి ప్రమాదాలు వాటిళ్లకుండా గట్టి చర్యలు తీసుకుని ఉన్న దృష్ట్యా, మరింతగా భారీ ప్రమాదం తప్పినట్టు అయింది.
బతుకు ఛిద్రం
Published Fri, Dec 2 2016 2:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
Advertisement