interior ministry
-
ఉక్రెయిన్‌లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన కీవ్‌కి ఈశాన్యంగా సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలోని కిండర్‌గార్డెన్ సమీపంలో జరిగింది. వాస్తవానికి రష్యా దళాలు ఉపసంహరించుకునే వరకు ప్రారంభ దశల్లో రష్యా, ఉక్రెనియన్ దళాలు ఈ బ్రోవరీ పట్టణంపై నియంత్రణ కోసం తీవ్రంగా పోరు సలపడం గమనార్హం. ప్రస్తుతం ఘటనాస్థలంలో వైద్యులు, పోలీసులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో సంఘటనా స్థలంలో బాధితుల కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 🇺🇦🚁🔥A kindergarten destroyed as a result of a helicopter crash pic.twitter.com/WZx2Bk5ArN — AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023 (చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!) -
144లో ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు.. అందుకే సీజ్
ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఒక మెగా టోర్నీ జరుగుతుంటే దాని చుట్టూ అంచనాలు ఉండడం సహజం. సాకర్ సమరంలో పోటీ పడే ప్రతీ జట్టు అంతిమలక్ష్యం ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ను సాధించడమే. విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్‌లో వరల్డ్ చాంపియన్‌గా ఎవరు అవతరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఖతార్ లాంటి చిన్న దేశానికి ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఆ దేశానికి పెద్ద పండగ లాంటిదే అని చెప్పొచ్చు. అందుకే ఫిఫా వరల్డ్‌కప్ ఫేక్ ట్రోఫీలతో దోహాకు చెందిన ఒక వ్యక్తి వ్యాపారం మొదలెట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్‌ను పోలిన 144 ఫేక్ ట్రోఫీలను తయారు చేసి అమ్మాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఒక మెగా ఈవెంట్‌కు సంబంధించిన ట్రోఫీని ఇలా బహిరంగ మార్కెట్లో తయారు చేసి అమ్మాలంటే అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా తయారు చేసినందుకే సదరు వ్యక్తి నుంచి 144 ఫేక్ ట్రోఫీలను సీజ్ చేసినట్లు దేశ ఇంటీరియర్ మినిస్ట్రీ తన ట్విటర్లో ప్రకటించింది. ''మాకు పక్కా సమాచారం అందాకే ఫిఫా వరల్డ్‌కప్ ఫేక్ ట్రోఫీలను అమ్ముతున్న ముఠాను పట్టుకున్నాం. వారి వద్ద 144 ఫేక్ ట్రోఫీలు ఉన్నాయి. వాటిన్నింటిని సీజ్ చేశాం. అనుమతి లేకుండా ట్రోఫీలు తయారు చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.'' అంటూ తెలిపింది. ఇక నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న సాకర్ సమరంలో తొలి మ్యాచ్ ఆతిథ్య ఖతార్, ఈక్వేడార్ మధ్య జరగనుంది. మొత్తంగా 32 జట్లు పోటీ పడుతుండగా.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోనున్నాయి. ప్రతీ గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో ప్రతీ జట్టు రౌండ్ రాబిన్ పద్దతిలో మూడు సింగిల్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతీ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన రెండు జట్లు మొత్తంగా 16 జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఎనిమిది జట్లు క్వార్టర్స్‌కు, ఆపై సెమీస్‌లో నాలుగు జట్లు తలపడతాయి. ఇక సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు డిసెంబర్ 18న లుసైల్‌లోని లుసైల్ ఐకానిక్ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. The Economic and Cyber Crimes Combating Department, in cooperation with the Intellectual Property Protection Committee, seized 144 counterfeit cups similar to the FIFA World Cup Qatar 2022™, for violation of Law number 10/2021 on hosting FIFA World Cup Qatar 2022™. #MOIQatar pic.twitter.com/ysRXlhmo2S — Ministry of Interior (@MOI_QatarEn) November 2, 2022 చదవండి: నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్.. వీడియో వైరల్ -
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్‌లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: బిట్ కాయిన్, ఎథేరియం, రిపిల్, కార్డోనో వంటి క్రిప్టోకరెన్సీ కార్యకలాపాలు ఏవైనా భారత్‌లో కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేధించాలని సూచించిన కమిటీ, దేశంలో ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించే వారిపై జరిమానాలు విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. క్రిప్టోకరెన్సీల నియంత్రణ, నిషేధానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి ‘ది బ్యానింగ్ ఆఫ్ క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2019’ పేరుతో ఒక ముసాయిదా బిల్లును కూడా కమిటీ సిఫారసు చేసింది. క్రిప్టోకరెన్సీపై ఎటువంటి విధానాలను అవలంభించాలనే అంశంపై సిఫారసులు చేయడానికి కేంద్రం 2017 నవంబర్ 2న కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, సెబీ చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సభ్యులు. ‘‘ప్రైవేటు క్రిప్టోకరెన్సీతో ఇబ్బం దులు పొంచి ఉన్నాయి. ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం అధికం’’ అని సోమవారం విడుదలైన నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,116 క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ 119.46 బిలియన్ డాలర్లు. తాజాగా కమిటీ నివేదిక, ముసాయిదా బిల్లులను సంబంధిత అన్ని శాఖలు పరస్పర సంప్రతింపుల ద్వారా సమీక్షిస్తాయి. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తాయి. కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది. -
ఆఫ్ఘాన్‌లో 57 మంది తీవ్రవాదులు హతం
ఆఫ్ఘానిస్థాన్ పోలీసు, సైనికులు, నాటో సంకీర్ణ దళాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 57 మంది తీవ్రవాదులు మరణించారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి శుక్రవారం ఓ ఇక్కడ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆ ఘటనలో 10 మంది గాయపడ్డారని, మరో నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆ దళాలు 24 గంటల పాటు తీవ్రవాదుల ఏరివేత చర్యలు చేపట్టాయని మంత్రి వివరించారు. బగ్లాన్, కుందజ్ నంగర్హర్, కపిస, సారిపుల్, జవజాన్, కందహార్, హెల్మండ్ ప్రావెన్స్లో తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని అన్నారు. సంకీర్ణ దళాలు చేపట్టిన ఆ దాడుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి విడుదల చేసిన ఆ ప్రకటనలో తెలిపారు. కుందజ్ ప్రావెన్స్లో ఈ రోజు తెల్లవారుజామున ఆత్మాహుతి జరిపిన దాడిలో దాస్తీ- ఈ - అర్చి డిస్ట్రిక్ట్ ఉన్నతాధికారి షేక్ సదీరుద్దీన్ మరణించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా వెల్లడించారు.