ఆఫ్ఘానిస్థాన్ పోలీసు, సైనికులు, నాటో సంకీర్ణ దళాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 57 మంది తీవ్రవాదులు మరణించారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి శుక్రవారం ఓ ఇక్కడ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆ ఘటనలో 10 మంది గాయపడ్డారని, మరో నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆ దళాలు 24 గంటల పాటు తీవ్రవాదుల ఏరివేత చర్యలు చేపట్టాయని మంత్రి వివరించారు.
బగ్లాన్, కుందజ్ నంగర్హర్, కపిస, సారిపుల్, జవజాన్, కందహార్, హెల్మండ్ ప్రావెన్స్లో తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని అన్నారు. సంకీర్ణ దళాలు చేపట్టిన ఆ దాడుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి విడుదల చేసిన ఆ ప్రకటనలో తెలిపారు. కుందజ్ ప్రావెన్స్లో ఈ రోజు తెల్లవారుజామున ఆత్మాహుతి జరిపిన దాడిలో దాస్తీ- ఈ - అర్చి డిస్ట్రిక్ట్ ఉన్నతాధికారి షేక్ సదీరుద్దీన్ మరణించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా వెల్లడించారు.