![Woman Escapes From Shark Fish Over Beating On It Florida Coast - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/19/shark-fish.jpg.webp?itok=eOxI2rik)
Shark Attack On Woman: షార్క్ చేపలను సముద్రంలో దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం! కానీ షార్క్ చేప తన కాలును పట్టేసినా భయపడకుండా ఓ మహిళ అత్యంత చాకచక్యంతో దాన్నుంచి తప్పించుకుంది. హీదర్ వెస్ట్ అనే మహిళ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సముద్రంలోకి ఈత కొట్టడానికి దిగింది.
ఆమె సముద్రంలోకి దిగగానే.. క్షణాల్లో ఓ షార్క్ చేప ఆమె కాలును గట్టిగా పట్టేసి సముద్రంలోకి లాక్కునే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆమె షార్క్ చేప నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాళ్లు, చేతులు గట్టిగా ఆడిస్తూ.. దాని తలపై బలంతో కొడుతూ దాడి చేసి తప్పించుకుంది.
ఈ విషయాన్ని హీదర్ వెస్ట్ స్వయంగా వెల్లడించారు. షార్క్ చేపతో దాదాపు 35 సెకన్ల పాటు భీకరంగా పోరాడినట్లు తెలిపారు. బలంగా కొట్టడంతో షార్క్ చేప తనను వదిలేసిందని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment