ప్రతీకాత్మక చిత్రం
అడిలైడ్ : ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్న గ్రేట్ వైట్ షార్క్‌తో ఒట్టి చేతుల్తో పోరాటం చేశాడో వ్యక్తి. దాన్ని భయపెట్టి తోక ముడిచేలా చేసి, ప్రాణాలు నిలుపుకున్నాడు. షార్క్ దాడి నుంచి ప్రాణాలను రక్షించుకున్న తన అనుభవాలను లేఖ రాశాడు. వివరాల్లోకి వెళితే.. సౌత్ అస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి ఆదివారం అక్కడి కంగారూ ఐలాండ్‌లోని సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో గ్రేట్ వైట్ షార్క్ అతడిపై దాడి చేసింది. ఒట్టి చేతుల్తో పోరాటం చేసి దాన్ని తరిమేశాడు. అనంతరం సర్ఫింగ్ బోర్డుతో సముద్రంలోనుండి బయటకు వచ్చేశాడు. షార్క్ దాడిలో వీపు కింద బాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. అయినప్పటికి ఓ 300 మీటర్ల దూరం వరకు నడుచుకుంటూ వచ్చాడు. గాయాలతో ఉన్న అతడ్ని చూసిన ఓ పారామెడిక్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో గాయాలకు చికిత్స చేయించుకున్న తర్వాత షార్క్‌తో పోరాడిన అనుభవాలను ఓ లేఖ రాశాడు. ( ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం! )
ఆ లేఖలో.. ‘‘ ఎప్పటిలాగే ఆ రోజు కూడా సర్ఫింగ్ చేయటానికి వెళ్లాను. సముద్రంలో సర్ఫింగ్ బోర్డుపై ఉన్నాను. హఠాత్తుగా నా బోర్డు ఎడమ వైపు ఏదో తగిలినట్లు అనిపించింది. అది ఓ ట్రక్కు ఢీ కొట్టినట్లుగా ఉంది. అనంతరం ఆ షార్క్ నాపై దాడి చేయటం మొదలుపెట్టింది. మోకాళ్లు, తొడలను తీవ్రంగా గాయపర్చింది. నేను దానితో పోరాడాను అది అక్కడినుంచి కనిపించకుండా పోయింద’’ని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( రైతు జీవితం మార్చేసిన ఖరీదైన వజ్రం )
Comments
Please login to add a commentAdd a comment