మనోజ్ బాజ్ పాయ్
బ్రిస్బేన్: హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మనోజ్ బాజ్ పాయ్. గతేడాది విడుదలైన ‘భోంస్లే’ చిత్రంలో మనోజ్ నటనకు గానూ అంతర్జాతీయ అవార్డు వరించింది. ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ నటులను వెనక్కు నెట్టి ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్ పాయ్ అవార్డు దక్కించుకున్నారు. ‘గోల్డ్ లాడెన్ షీప్ అండ్ ద సాక్రెడ్ మౌంటెయిన్’ చిత్రానికిగానూ నూతన దర్శకుడు రిధమ్ జాన్వే ‘యంగ్ సినిమా’ అవార్డును అందుకున్నారు.
శుక్రవారం బ్రిస్బేన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ.. ‘ కేవలం నా కూతురి కోసం ఈ అవార్డును గెలవాలనుకున్నాను. ఎందుకంటే నేను ఈ రోజు అవార్డు గెలుస్తానని నా చిన్ని కూతురు ఎంతో ఆశ పెట్టుకుంది. అది నెరవేరింద’ని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నటుడిగా సినీ జీవితం ప్రారంభించిన మనోజ్ తర్వాత నిర్మాతగానూ మారారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న భోంస్లే చిత్రానికి మనోజ్ సహనిర్మాతగా కూడా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment