Best Actor Award
-
ఉత్తమ నటుడిగా విజయ్, ఉత్తమ విలన్ అవార్డు ఎవరంటే?
ఒసాకా తమిళ్ అంతర్జాతీయ 2021 సినీ అవార్డుల వేడుక ఇటీవల జపాన్‌లో జరిగింది. ఈ వేదికపై 2021 ఏడాదికి గానూ తమిళ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. అందులో మాస్టర్ చిత్రంలోని నటనకు గానూ కథానాయకుడు విజయ్‌కు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించారు. మాళవికా మోహన్ హీరోయిన్గా నటించిన ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్, ఎక్స్‌బీ.ఫిలిం క్రియేటర్స్ సంస్థలు నిర్మించాయి. ఇందులో నటించిన విజయ్‌సేతుపతికి ఉత్తమ ప్రతినాయకుడు అవార్డును ప్రకటించారు. ఈ చిత్రంలోని వాత్తి కమింగ్ పాట ఉత్తమ పాట అవార్డును గెలుచుకుంది. ఆ విధంగా మాస్టర్ చిత్రం మూడు అవార్డులను కై వసం చేసుకుంది. ఇకపోతే తలైవి చిత్రంలో నటనకు గానూ నటి కంగనారనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు వరించింది. అదే విధంగా సార్పట్ట పరంపరై చిత్రానికి గానూ పా.రంజిత్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును మానాడు చిత్రానికి గానూ దర్శకుడు వెంకట్‌ప్రభు గెలుచుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ అవార్డును మండేలా చిత్రానికి గానూ వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్, ఓపెన్ విండో ప్రొడక్షన్స్, విష్బెర్రి ఫిలింస్ సంస్థలు గెలుచుకున్నాయని అవార్డుల జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. Thalapathy Vijay's #Master bags 3 awards at the Osaka Film International Festival. The Osaka Tamil Film International Film Festival was recently held in Japan. Vijay was awarded the "Best Actor" award for his performance in Master. #LEO #LeoFilm #BloodySweet @actorvijay pic.twitter.com/DcHHFXx4Of — Actor Vijay Team (@ActorVijayTeam) May 23, 2023 చదవండి: విషాదం.. కారు ప్రమాదంలో నటి మృతి -
‘బలగం’కి మరో రెండు అవార్డులు
ఓ కుటుంబ పెద్ద చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల భావోద్వేగం, అనుబంధాలతో సాగే ‘బలగం’కి విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. తాజాగా ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. -
ఆస్కార్ బరిలో ఆ ఐదుగురు స్పెషల్.. ఎందుకంటే?
ఆస్కార్ ఆ పేరు వింటేనే అదో గొప్ప. అవార్డ్ రాకపోయినా సరే.. కనీసం నామినేట్ అయినా ఆ ఫీలింగే వేరు. ప్రపంచ వేదికపై మన పేరు వినిపించాలని ఎవరికీ మాత్రం కోరిక ఉండదు. ఈ ఏడాది జరగునున్న 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా.. ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఐదుగురు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఈ ఐదుగురు తొలిసారి ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. దీంతో ఎవరినీ అవార్డ్ వరించినా అది తొలిసారి దక్కించుకున్న ఘనత వారికి సొంతమవుతుంది.. ఉత్తమ నటుడి రేసులో తొలిసారి పోటీలో నిలిచిన ఐదుగురు వీరే ఆస్టిన్ రాబర్ట్ బట్లర్ అమెరికన్ సింగర్ ఎల్వీస్ ప్రెస్లీ జీవిత కథలో అద్భుతంగా నటించారు ఆస్టిన్ రాబర్ట్ బట్లర్. ఆయన నటనే 95వ ఆస్కార్ రేసులో నిలిచేలా చేసింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. బట్లర్ యుక్త వయస్సులోనే టెలివిజన్ ధారావాహికలు ‘ది క్యారీ డైరీస్’, ది షన్నారా క్రానికల్స్’ లో నటనకు పేరు సంపాదించారు. ఏలియన్స్ ఇన్ ది అట్టిక్(2009) చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో మోస్ట్ ప్రామిసింగ్ పెర్ఫార్మర్ అవార్డును కైవసం చేసుకున్నారు. కోలిన్ జేమ్స్ ఫారెల్ ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రంలో పాడ్రాయిక్ పాత్రతో నామినేషన్ దక్కించుకున్నారు కోలిన్ జేమ్స్ ఫారెల్(46). ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఫారెల్ ది వార్ జోర్ సినిమాతో కెరీర్ మొదలెట్టిన కోలిన్ జేమ్స్ ‘టైగర్ ల్యాండ్, మైనారిటీ రిపోర్ట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ కామెడీ చిత్రం ఇన్ బ్రూగెస్‌లో ఆయన పాత్రకి ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్ కామెడీ సినిమాలతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి యుక్త వయస్సులో ఉన్న తన కూతురితో బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది వేల్’. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన ‘డాగ్ ఫైట్’, ‘ఎన్సినో మ్యాన్, స్కూల్ టైస్, జార్జ్ ఆఫ్ ది జంగిల్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ‘ది వేల్’ చిత్రంలోని నటనకు ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా 12 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. చిన్న వయస్సులో పాల్ మెస్కల్ ఆస్కార్ ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన అతి చిన్న వయస్సు కలిగిన నటుడు పాల్ మెస్కల్(27). ‘ఆఫ్టర్ సన్’ ఈ చిత్రంలో 11 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నార్మల్ పీపుల్ అనే మినీ సిరీస్‌తో మెస్కల్ గుర్తింపు పొందారు. బ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డ్స్‌లో కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. అత్యధిక వయసులో బిల్ నైజీ అత్యధిక వయసులోనూ ‘లివింగ్’ అనే చిత్ర నటుడు బిల్ నైజీ 73 ఏళ్ల వయసులో బరిలో నిలిచాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పాత్రలో నటించి మెప్పించారు. ‘గిడియాన్స్ డాటర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. లవ్ యాక్చువల్లీ అనే చిత్రానికి బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. -
ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో హీరో ఆదిత్య ఓంకు అవార్డు
నటుడు, డైరెక్టర్ ఆదిత్య ఓం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ బయటపెట్టారు.తాజాగా జరిగిన రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా ఆదిత్య ఓం అవార్డు గెలుచుకున్నారు. 'దహ్నం'. ఈ సినిమాలో బ్రాహ్మణ పూజారిగా ఆయన నటనకు గాను ప్రశంసలతో పాటు అవార్డ్స్ దక్కాయి.రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రతిష్టాత్మక ఎనిమిది ఎడిషన్లలో ప్రాంతీయ చలనచిత్ర విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు ఆదిత్య ఓం. ఈ గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణధీర్ కపూర్ వంటి దిగ్గజాలకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందించారు. మరోవైపు ఆదిత్య ఓంకు ముంబైలోని ప్రైమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. దీంతో ఆనందంలో మునిగిపోయిన ఆదిత్య ఓం.. తాను మళ్లీ మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఈ అవార్డులు ఎంతగానో దోహదపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక 'దహ్నం' చిత్రానికి రచన, దర్శకత్వం వహించిన మూర్తి అడారికి కూడా బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు లభించింది. -
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఈ స్టార్ హీరో
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్నిప్రయోగాత్మకంగా ఆవిష్కరించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అంతేకాదు ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. తమిళ మూవీ ‘అసురన్’ ద్వారా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెల్చుకున్న సందర్భంగా స్పెషల్ వీడియో. (National Film Awards: వాళ్లు..నావాళ్లు, ఇది చరిత్ర: ఐశ్వర్య) -
నన్ను తిట్టుకుంటారనుకున్నాను!
కొన్నిసార్లు సినిమాలోని పాత్రలు రిస్కీగా ఉంటాయి. అనుకున్న విధంగా తెరమీద కనిపించకపోతే నటులు విమర్శలపాలు కావాల్సి ఉంటుంది. అనుకున్నట్టే జరిగితే అన్నీ ప్రశంసలే. ‘సూపర్ డీలక్స్’ సినిమా అంగీకరించే ముందు సమంత కూడా ఇలాంటి సందర్భాన్నే ఎదుర్కొన్నారట. ఈ సినిమాలో సమంత పాత్ర బోల్డ్‌గా కొంచెం నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. అయితే ఈ పాత్ర సమంతకు మంచి పేరు తీసుకొచ్చింది. బెస్ట్ యాక్టర్‌గా తమిళంలో అవార్డును కూడా అందుకున్నారు. ‘‘ఈ పాత్రను అంగీకరించే సమయంలో ప్రేక్షకులు నన్ను విపరీతంగా తిట్టుకుంటారు లేదా బాగా అభినందిస్తారు అనుకుంటూ ఒప్పుకున్నాను. నా పాత్రకు ఎటువంటి విమర్శలు రాలేదు. ఈ సినిమాలో నటించడం నాకో మంచి అనుభవం’’ అని అవార్డును అందుకున్న తర్వాత మాట్లాడారు సమంత. ఇదిగో ఇక్కడ లేత గులాబీ రంగు చీరలో సమంత కనిపిస్తున్నారు కదా. ఈ డిజైనర్ శారీలోనే ఆమె వేడుకకు హాజరయ్యారు. ఫంక్షన్లో సమంత చీర ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చీర బాగా నచ్చిందేమో ఆమె స్పెషల్‌గా ఫొటోషూట్ చేయించుకున్నారు. చై (భర్త నాగచైతన్యను సమంత ‘చై’ అనే అంటారు) ట్యాటూ కనపడేట్టు ఆమె ఫొటోలు దిగారు. ఫొటోను క్లియర్‌గా గమనిస్తే ‘చై’ ట్యాటూని మీరూ చూడొచ్చు. -
నా కూతురికోసం ఆ అవార్డు గెలవాలనుకున్నా
బ్రిస్బేన్: హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మనోజ్ బాజ్ పాయ్. గతేడాది విడుదలైన ‘భోంస్లే’ చిత్రంలో మనోజ్ నటనకు గానూ అంతర్జాతీయ అవార్డు వరించింది. ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ నటులను వెనక్కు నెట్టి ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్ పాయ్ అవార్డు దక్కించుకున్నారు. ‘గోల్డ్ లాడెన్ షీప్ అండ్ ద సాక్రెడ్ మౌంటెయిన్’ చిత్రానికిగానూ నూతన దర్శకుడు రిధమ్ జాన్వే ‘యంగ్ సినిమా’ అవార్డును అందుకున్నారు. శుక్రవారం బ్రిస్బేన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ.. ‘ కేవలం నా కూతురి కోసం ఈ అవార్డును గెలవాలనుకున్నాను. ఎందుకంటే నేను ఈ రోజు అవార్డు గెలుస్తానని నా చిన్ని కూతురు ఎంతో ఆశ పెట్టుకుంది. అది నెరవేరింద’ని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నటుడిగా సినీ జీవితం ప్రారంభించిన మనోజ్ తర్వాత నిర్మాతగానూ మారారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న భోంస్లే చిత్రానికి మనోజ్ సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. -
జీవీకి ఉత్తమ నటుడు అవార్డు
పెరంబూరు: యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ను ఉత్తమ నటుడు అవార్డు వరించింది. సంగీతదర్శకత్వం, నటన అంటూ రెండు పడవలపైనా సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఈయన నటుడిగా ఇటీవల వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంచుకుంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య బాలా దర్శకత్వం వహించిన నాచియార్ చిత్రంలో చాలా భిన్నమైన పాత్రను సమర్థవంతంగా పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇటీవల సర్వం తాళమయం చిత్రంలో నటించారు. ప్రముఖ ఛా యాగ్రాహకుడు రాజీవ్‌మీనన్ దర్శకత్వం వ హించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. చిత్రం పలువురి ప్రశంసలను అందుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శంపబడింది. కాగా ఈ చిత్రంలో నటనకుగానీ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ప్రోవోక్ మేగజైన్ ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డుల వేడుక బుధవారం రాత్రి చెన్నైలో జరిగింది. ఈ వేదికపై అవార్డును అందుకున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ చిత్ర దర్శకుడు రాజీవ్‌మీనన్‌కు తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సంగీతప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జీవీకి జంటగా అపర్ణా బాలమురళీ నటించింది. నెడుముడి వేణు, వినీత్, కుమరవేల్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం ఇసైజ్ఞానం మణిదరిన్ పిరప్పు పార్తు వరువదిలై అనే కథ నుంచి తీసుకున్న పాయింట్‌తో రూపొందించబడింది. సర్వం తాళమయం చిత్రం గత ఫిబ్రవరిలో విడుదలైంది. కాగా జపాన్‌లో ఇటీవల జరిగిన టోక్యో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఆ దేశ ప్రజలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన సినీ ప్రముఖుల నుంచి విశేష ఆదరణను పొంది ప్రశంసలు అందుకుంది. కాగా ప్రోవోక్ మేగజైన్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. జీవీ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
భారతీయ కట్టు.. భలే ఆకట్టు
హాలీవుడ్లో అవార్డ్స్ సీజన్ మొదలైంది. ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టేది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ప్రతి ఏడాది జనవరిలో ఈ వేడుక జరుగుతుంది. 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ సోమవారం ఉదయం (భారతకాలమాన ప్రకారం) జరిగింది. ఎన్నో విశేషాలతో పాటు పలు ఆశ్చర్యాలు కూడా ఈ వేడుకలో చోటు చేసుకున్నాయి. అన్ని అవార్డ్స్ చేజిక్కించుకుంటాయనుకున్న సినిమాలు ఉత్త చేతులతో వెళ్లడం, అంచనాలు లేకుండా వచ్చినవి ఉత్తమ చిత్రాలుగా మిగలడం, నటుడిగా క్రిస్టిన్ బేల్ తొలి అవార్డు దక్కించుకోవడం, ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంటుందనుకున్న ‘స్టార్ ఈజ్ బోర్న్’ చిత్రం కేవలం ఒక్క అవార్డ్‌తో సరిపెట్టుకోవడం, అంచనాలు లేని ‘గ్రీన్ బుక్’ సినిమా అనూహ్యంగా ఎక్కువ అవార్డ్స్ సంపాదించడం, సూపర్ హీరో (బ్లాక్ పాంథర్) సినిమా గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అవ్వడం ఇదే తొలిసారి. పొడుగు గౌన్లతో రెడ్ కార్పెట్ మీద వయ్యారంగా కొందరు తారలు వాక్ చేస్తే, ఎర్ర తివాచీపై చీరగాలి కూడా తగలడం మరో విశేషం. ఆస్కార్‌కు ముందుగా జరిగే ఈ అవార్డ్ ఫంక్షన్ కేవలం సినిమాలకే కాదు టెలివిజన్‌కు కూడా అవార్డ్స్ అందిస్తుంది. మొత్తం 25 విభాగాల్లో అవార్డ్స్ అందించే ఈ షోలో 14 విభాగాలు సినిమాకు, 11 విభాగాలు టెలివిజన్‌కు అందిస్తారు.. ‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్’ అనే ట్యాగ్ ఆస్కార్ అవార్డ్ ఓటింగ్‌లో ఎంతో కొంత ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. మొదటి గ్లోబ్ అవార్డ్ పాత్రలా మారడానికి శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకుంటుంటారు నటుడు క్రిస్టిన్ బేల్. ఇప్పటికే మూడుసార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో నామినేషన్ సంపాదించినప్పటికీ నిరాశతోనే వెనుదిరిగారు. కానీ ‘వైస్’లో చేసిన అమెరికన్ వైజ్ ప్రెసిడెంట్ ఆడమ్ మెక్కే పాత్రకు ఆయన తొలి గ్లోబ్ అవార్డుని అందుకున్నారు. ఈ పాత్ర కోసం సుమారు నలభై పౌండ్ల (20 కిలోల) బరువు పెరగడంతోపాటు కనుబొమలను బ్లీచ్ చేయించుకున్నారు. 2011లో సహాయ నటుడి (ది ఫైటర్)గా ఈ అవార్డ్ అందుకున్నప్పటికీ బెస్ట్ యాక్టర్‌గా తొలి అవార్డ్ ఇది. కార్పెట్‌పై చీరగాలి రెడ్ కార్పెట్‌పై ఎక్కువగా పొడుగు గౌన్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ తొలిసారి ఈ కార్పెట్‌కు చీరగాలిని తగిలించారు బాలీవుడ్ భామ మనస్వీ మంగై. ఈ అవార్డ్స్ ఫంక్షన్స్‌కు ప్రియాంకా చోప్రా హైలైట్‌గా నిలుస్తారని ఊహించారంతా కానీ ఆమె హాజరు కాలేదు. అప్పటివరకూ వస్తున్న గౌన్ల ట్రెండ్‌ని పక్కన పెట్టి, మనస్వీ మంగై చీరలో ప్రత్యక్షం కావడం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. ‘టాక్ ఆఫ్ ది ఈవినింగ్’ అయ్యారామె. ‘‘హాలీవుడ్‌కు ఇది ఫస్ట్ అవార్డ్ సీజన్, అలాగే నాకు కూడా. అందుకే ఈ ఫంక్షన్‌కు కొత్తగా మన భారతీయ స్టైల్లో డ్రెస్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే చీర కట్టుకుని హాజరయ్యాను. ఇక్కడి ప్రెస్, హాలీవుడ్ నటీనటులు చాలా మంది నేనెవర్ని, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? అని కనుక్కున్నారు’’ అంటూ తన ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ ఆనందాన్ని పంచుకున్నారు మనస్వి. అవార్డ్స్ లిస్ట్ : బెస్ట్ డైరెక్టర్: అల్ఫోన్సో కువారన్ (రోమా) ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్ ఉత్తమ నటుడు (డ్రామా): రామి మలెక్ (బోమియన్ రాప్సొడీ) ఉత్తమ నటుడు (కామెడీ, మ్యూజికల్): క్రిస్టిన్ బేల్ (వైస్) విదేశీ చిత్రం: రోమా ఒరిజినల్ సాంగ్: షాలో (స్టార్ ఈజ్ బోర్న్) ఒరిజినల్ స్కోర్: జస్టిన్ హర్విట్జ్ (ఫస్ట్ మ్యాన్) యానిమేషన్ మూవీ: స్పైడర్ మేన్–ఇన్ టు ది స్పైడర్ వెర్స్ స్క్రీన్ ప్లే: నిక్ వెల్లెలోంగ, బ్రియన్ క్యూరీ, పీటర్ ఫరేల్లీ (గ్రీన్‌బుక్) సహాయ నటుడు: మహేర్షలా అలీ (గ్రీన్ బుక్) సహాయ నటి: రెగీనా కింగ్ (ఈఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్) మనస్వీ మంగై, దీపికా పదుకోన్ -
బుల్లి జాహ్నవి కపూర్ వీడియో : వైరల్
-
జాన్వీ చిన్ననాటి వీడియో : వైరల్
ముంబై : చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనులు, స్టేజీలపై వేసిన డ్యాన్సులు ఇవన్నీ.. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక వాటి వీడియోలు చూసుకుని ఇప్పటికీ మురిసిపోతూ ఉంటాం. ఇక స్టార్ హీరోలతో దిగిన ఫోటోలు, వీడియోలు ఎంతో మెమరబుల్‌గా ఉంచుకుంటాం. తాజాగా 2002లో జరిగిన ‘జీ సినీ అవార్డు’లకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. అది బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌కు, అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు బుల్లి జాన్వీ కపూర్ అవార్డు ఇచ్చే వీడియో. త్వరలోనే ‘దడక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్ తన చిన్నతనంలో స్టేజీపై నిల్చుని, తన బుజ్జిబుజ్జి మాటలతో షారుఖ్‌ను స్టేజీపైకి పిలిచి దేవ్‌దాస్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చింది. త్వరలోనే ధడక్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ అవార్డు ఇచ్చే సమయంలో జాన్వీ కపూర్‌తో పాటు తండ్రి బోని కపూర్, నటి ప్రీతి జింటా కూడా ఉన్నారు. బోని కపూర్, తన చిన్నారిని ఎత్తుకుంటే, ఆమె బెస్ట్ యాక్టర్ అవార్డును షారుఖ్ పుచ్చుకోవాల్సిందిగా స్టేజీ పైకి పిలవడం... ఆ అనంతరం జాన్వీ పిలుపుకు వెంటనే స్టేజీ పైకి వచ్చిన షారుఖ్, వెంటనే ఆమె బుగ్గపై ముద్దు పెట్టడం ఈ వీడియోలో ఎంతో చూడముచ్చటగా ఉంది. అనంతరం జాన్వీ చేతుల మీదుగా షారుఖ్ అవార్డును అందుకోవడం, అందరూ కలిసి స్టేజీలపై ఫోటోలు దిగడం.. క్యూట్‌నెస్ ఉట్టిపట్టేలా ఉందని అభిమానులంటున్నారు. 2002లో ఆ బుల్లి జాన్వీనే.. నేడు ధడక్ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. ఇషాన్ ఖట్టర్‌కు జోడిగా జాన్వీ అద్భుతమైన నటనను కనబర్చినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్లోనే అర్థమవుతోంది. -
విలక్షణ నటుడికి అవార్డు
ముంబై: విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తన నటనతో బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్‌లోను సత్తా చాటాడు. హాలీవుడ్లో నటుడిగా సక్సెస్ అయ్యాడు. అక్కడ ప్రశంసలు పొందాడు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన హిందీ మీడియమ్ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో... భాషలు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో భావోద్వేగంగా చూపించాడు. ఈ సినిమాలో ఇర్ఫాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. న్యూస్ 18 అందించే రీల్ మూవీ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ ఖాన్ ఎంపికయ్యాడు. అనారోగ్యం కారణంగా ఈ వేడుకకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోయాడు. ఇర్ఫాన్‌కు బదులు డైరెక్టర్ సుదీర్ మిశ్రా అవార్డును తీసుకున్నారు. ఈ అవార్డు అతనికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. అలాగే న్యూటన్ సినిమా డైరెక్టర్ అమిత్ మసుర్కర్ ఉత్తమ దర్శకుడిగా, రత్న పటక్ షా ఉత్తమ నటిగా, ముక్తి భవన్ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డులు లభించాయి. -
టాన్స్‌జెండర్ పాత్రకు ఉత్తమ నట కిరీటం
ఉత్తమ నటుడు-కన్నడ హీరో విజయ్ ( కన్నడ చిత్రం ‘నాన్ అవనల్ల అవళు’) సున్నితమైన ట్రాన్స్జెండర్ల అంశంపై తీసిన ‘నాన్ అవనల్ల... అవళు’ (తెలుగులో ‘నేను పురుషుణ్ణి కాదు... స్త్రీని’ అని అర్థం) చిత్రంలో కీలకమైన ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సంచారి విజయ్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. తీసుకున్న క్లిష్టమైన అంశాన్ని అద్భుతంగా తెరకెక్కించినందుకు గాను విమర్శకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. బి.ఎస్. లింగదేవరు రూపొందించిన ఈ చిత్రానికి లివింగ్ స్మైల్ విద్య ఆత్మకథ ‘అయామ్ విద్య’ ఆధారం. చిత్రం ఏమిటంటే, ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో కన్నడ భాషా చిత్రంగా ఈ సారి అవార్డు గెల్చుకున్న ‘హరివు’ చిత్రంలోనూ విజయ్ నటించారు. -
పవన్, ప్రిన్స్ 'సై'మా!
కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చిన చిత్రాలతో గతేడాది హిట్లు సాధించిన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఈసారి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2014 అవార్డుల రేసులో పోటీ పడుతున్నారు. పవన్- అత్తారింటికి దారేదీ, మహేష్- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఈ టాలీవుడ్ టాప్ హీరోలు పోటీలో ముందున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఎక్కువ ఈ రెండు చిత్రాలే దక్కించుకున్నాయి. 'అత్తారింటికి దారేదీ' నాలుగు అవార్డులను సొంతం చేసుకోగా, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రెండు అవార్డులను ఎగరేసుకెళ్లింది. మహేశ్ బాబు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ప్రిన్స్'కు నాలుగో ఫిలింఫేర్ అవార్డు కావడం విశేషం. అంతకుముందు ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాలకు అవార్డు అందుకున్నాడు. సైమాలోనూ పవన్, ప్రిన్స్ ముందు వరుసలో నిలిచారు. ఉత్తమ నటుడు విభాగంలో వీరితో పాటు వెంకటేష్(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), ప్రభాస్(మిర్చి), రామ్ చరణ్(నాయక్), నితిన్(గుండెజారి గల్లంతయిందే) కూడా రేసులో ఉన్నారు. వీరిలో ఉత్తమ నటుడిగా ఎంపికవుతారన్నది సెప్టెంబర్ లో తెలుస్తుంది. మలేసియాలోని కౌలాలంపూర్ లో సెప్టెంబర్ 12, 13న సైమా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. 'గబ్బర్ సింగ్'లో నటనకు గతేడాది పవన్ కళ్యాణ్ 'సైమా' ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. పవన్ ఈసారి కూడా 'సైమా'లో పాగా వేస్తాడో, లేదో చూడాలి.