
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్నిప్రయోగాత్మకంగా ఆవిష్కరించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్.
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్నిప్రయోగాత్మకంగా ఆవిష్కరించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అంతేకాదు ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. తమిళ మూవీ ‘అసురన్’ ద్వారా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెల్చుకున్న సందర్భంగా స్పెషల్ వీడియో. (National Film Awards: వాళ్లు..నావాళ్లు, ఇది చరిత్ర: ఐశ్వర్య)