పవన్, ప్రిన్స్ 'సై'మా! | Pawan Kalyan, Mahesh Babu compete for SIIMA Award | Sakshi
Sakshi News home page

పవన్, ప్రిన్స్ 'సై'మా!

Published Mon, Jul 21 2014 4:29 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్, ప్రిన్స్ 'సై'మా! - Sakshi

పవన్, ప్రిన్స్ 'సై'మా!

కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చిన చిత్రాలతో గతేడాది హిట్లు సాధించిన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఈసారి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2014 అవార్డుల రేసులో పోటీ పడుతున్నారు. పవన్- అత్తారింటికి దారేదీ, మహేష్- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఈ టాలీవుడ్ టాప్ హీరోలు పోటీలో ముందున్నారు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఎక్కువ ఈ రెండు చిత్రాలే దక్కించుకున్నాయి. 'అత్తారింటికి దారేదీ' నాలుగు అవార్డులను సొంతం చేసుకోగా, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రెండు అవార్డులను ఎగరేసుకెళ్లింది. మహేశ్ బాబు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ప్రిన్స్'కు నాలుగో ఫిలింఫేర్ అవార్డు కావడం విశేషం. అంతకుముందు ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాలకు అవార్డు అందుకున్నాడు.

సైమాలోనూ పవన్, ప్రిన్స్ ముందు వరుసలో నిలిచారు. ఉత్తమ నటుడు విభాగంలో వీరితో పాటు వెంకటేష్(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), ప్రభాస్(మిర్చి), రామ్ చరణ్(నాయక్), నితిన్(గుండెజారి గల్లంతయిందే) కూడా రేసులో ఉన్నారు. వీరిలో ఉత్తమ నటుడిగా ఎంపికవుతారన్నది సెప్టెంబర్ లో తెలుస్తుంది. మలేసియాలోని కౌలాలంపూర్ లో సెప్టెంబర్ 12, 13న సైమా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. 'గబ్బర్ సింగ్'లో నటనకు గతేడాది పవన్ కళ్యాణ్ 'సైమా' ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. పవన్ ఈసారి కూడా 'సైమా'లో పాగా వేస్తాడో, లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement