టాన్స్‌జెండర్ పాత్రకు ఉత్తమ నట కిరీటం
ఉత్తమ నటుడు-కన్నడ హీరో విజయ్ ( కన్నడ చిత్రం ‘నాన్ అవనల్ల అవళు’)
సున్నితమైన ట్రాన్స్‌జెండర్ల అంశంపై తీసిన ‘నాన్ అవనల్ల... అవళు’ (తెలుగులో ‘నేను పురుషుణ్ణి కాదు... స్త్రీని’ అని అర్థం) చిత్రంలో కీలకమైన ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సంచారి విజయ్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. తీసుకున్న క్లిష్టమైన అంశాన్ని అద్భుతంగా తెరకెక్కించినందుకు గాను విమర్శకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. బి.ఎస్. లింగదేవరు రూపొందించిన ఈ చిత్రానికి లివింగ్ స్మైల్ విద్య ఆత్మకథ ‘అయామ్ విద్య’ ఆధారం. చిత్రం ఏమిటంటే, ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో కన్నడ భాషా చిత్రంగా ఈ సారి అవార్డు గెల్చుకున్న ‘హరివు’ చిత్రంలోనూ విజయ్ నటించారు.