ముంబై : చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనులు, స్టేజీలపై వేసిన డ్యాన్సులు ఇవన్నీ.. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక వాటి వీడియోలు చూసుకుని ఇప్పటికీ మురిసిపోతూ ఉంటాం. ఇక స్టార్ హీరోలతో దిగిన ఫోటోలు, వీడియోలు ఎంతో మెమరబుల్‌గా ఉంచుకుంటాం. తాజాగా 2002లో జరిగిన ‘జీ సినీ అవార్డు’లకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది. అది బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌కు, అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు బుల్లి జాన్వీ కపూర్ అవార్డు ఇచ్చే వీడియో. త్వరలోనే ‘దడక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్ తన చిన్నతనంలో స్టేజీపై నిల్చుని, తన బుజ్జిబుజ్జి మాటలతో షారుఖ్‌ను స్టేజీపైకి పిలిచి దేవ్‌దాస్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చింది. త్వరలోనే ధడక్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆ అవార్డు ఇచ్చే సమయంలో జాన్వీ కపూర్‌తో పాటు తండ్రి బోని కపూర్, నటి ప్రీతి జింటా కూడా ఉన్నారు. బోని కపూర్, తన చిన్నారిని ఎత్తుకుంటే, ఆమె బెస్ట్ యాక్టర్ అవార్డును షారుఖ్ పుచ్చుకోవాల్సిందిగా స్టేజీ పైకి పిలవడం... ఆ అనంతరం జాన్వీ పిలుపుకు వెంటనే స్టేజీ పైకి వచ్చిన షారుఖ్, వెంటనే ఆమె బుగ్గపై ముద్దు పెట్టడం ఈ వీడియోలో ఎంతో చూడముచ్చటగా ఉంది. అనంతరం జాన్వీ చేతుల మీదుగా షారుఖ్ అవార్డును అందుకోవడం, అందరూ కలిసి స్టేజీలపై ఫోటోలు దిగడం.. క్యూట్‌నెస్ ఉట్టిపట్టేలా ఉందని అభిమానులంటున్నారు. 2002లో ఆ బుల్లి జాన్వీనే.. నేడు ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. ఇషాన్ ఖట్టర్‌కు జోడిగా జాన్వీ అద్భుతమైన నటనను కనబర్చినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోనే అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment