ప్యాసింజర్‌పై అత్యాచారం.. ఉబర్ డ్రైవర్ అరెస్ట్ | Uber driver charged with raping teen passenger in Australia | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌పై అత్యాచారం.. ఉబర్ డ్రైవర్ అరెస్ట్

Published Fri, Jul 14 2017 12:24 PM | Last Updated on Thu, Aug 30 2018 9:05 PM

ప్యాసింజర్‌పై అత్యాచారం.. ఉబర్ డ్రైవర్ అరెస్ట్ - Sakshi

ప్యాసింజర్‌పై అత్యాచారం.. ఉబర్ డ్రైవర్ అరెస్ట్

బ్రిస్బేన్‌: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉబర్ డ్రైవర్(37) ను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో ఇది రెండో అరెస్ట్ కేసు అని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జూలై 8న 16 ఏళ్ల బాలిక ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. మార్గం మధ్యలో క్యాబ్ డ్రైవర్ ఆమెను లైంగికంగా వేధించాడు.

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక విషయాన్ని తల్లిదండ్రులు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉబర్ డ్రైవర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉబర్ సంస్థ ఆ క్యాబ్ డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్రిస్బేన్ మేజిస్ట్రేట్ కోర్టులో నిందితుడిని ప్రవేపెట్టగా తదుపరి విచారణ వరకూ కస్టడీకి తీసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement