ఉబర్ డ్రైవర్ నన్ను రేప్‌ చేయబోయాడు: నటి | Farrah Abraham reveals she was almost raped | Sakshi
Sakshi News home page

ఉబర్ డ్రైవర్ నన్ను రేప్‌ చేయబోయాడు: నటి

Published Sat, Mar 5 2016 8:58 AM | Last Updated on Thu, Aug 30 2018 9:05 PM

ఉబర్ డ్రైవర్ నన్ను రేప్‌ చేయబోయాడు: నటి - Sakshi

ఉబర్ డ్రైవర్ నన్ను రేప్‌ చేయబోయాడు: నటి

న్యూయార్క్‌: ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఉబర్ డ్రైవర్ తాను దాదాపు రేప్ చేయబోయాడని ప్రముఖ హాలీవుడ్ టీవీ నటి ఫర్హా అబ్రహం వెల్లడించింది. ఉబర్ ట్యాకీ డ్రైవర్ తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, వెంటనే తన బోయ్‌ఫ్రెండ్ వచ్చి కాపాడి ఉండకుంటే తనపై అఘాయిత్యం జరిగి ఉండేదని ఆమె పేర్కొంది. ఈ ఘటనతో ఉబర్‌ సంస్థను తాను పూర్తిగా నిషేధించానని, అప్పటినుంచి ఆ కంపెనీ ట్యాక్సీలను అస్సలు ఎక్కడం లేదని ఆమె తెలిపింది.

'టీన్‌ మామ్' టీవీ సీరిస్ తో పాపులరైన ఈ రియాల్టీ షో స్టార్‌ ఈ ఘటన గురించి తాజాగా వివరించింది. 'ఉబర్‌ డ్రైవర్ ఒకడు నన్ను దాదాపు రేప్ చేయబోయాడు. నా స్నేహితుడు సిమన్ సరన్ రావడంతో సరిపోయింది. సరన్‌ కారు అద్దాన్ని దాదాపు బద్దలుకొట్టి.. డ్రైవర్‌ను బయటకు తోసేశాడు. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చారు. పోలీసులు వచ్చినా ఆ పర్షియన్ వ్యక్తి నా వెంట పడ్డాడు. పోలీసులే అంత.. మనల్ని ఒకడు వేధిస్తున్నాడని చెప్పిన తర్వాత కూడా పట్టించుకోరు' అని ఆమె ఫర్హా పేర్కొంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement