Farrah Abraham
-
ఉబర్ డ్రైవర్ నన్ను రేప్ చేయబోయాడు: నటి
న్యూయార్క్: ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఉబర్ డ్రైవర్ తాను దాదాపు రేప్ చేయబోయాడని ప్రముఖ హాలీవుడ్ టీవీ నటి ఫర్హా అబ్రహం వెల్లడించింది. ఉబర్ ట్యాకీ డ్రైవర్ తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, వెంటనే తన బోయ్‌ఫ్రెండ్ వచ్చి కాపాడి ఉండకుంటే తనపై అఘాయిత్యం జరిగి ఉండేదని ఆమె పేర్కొంది. ఈ ఘటనతో ఉబర్ సంస్థను తాను పూర్తిగా నిషేధించానని, అప్పటినుంచి ఆ కంపెనీ ట్యాక్సీలను అస్సలు ఎక్కడం లేదని ఆమె తెలిపింది. 'టీన్ మామ్' టీవీ సీరిస్ తో పాపులరైన ఈ రియాల్టీ షో స్టార్ ఈ ఘటన గురించి తాజాగా వివరించింది. 'ఉబర్ డ్రైవర్ ఒకడు నన్ను దాదాపు రేప్ చేయబోయాడు. నా స్నేహితుడు సిమన్ సరన్ రావడంతో సరిపోయింది. సరన్ కారు అద్దాన్ని దాదాపు బద్దలుకొట్టి.. డ్రైవర్‌ను బయటకు తోసేశాడు. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చారు. పోలీసులు వచ్చినా ఆ పర్షియన్ వ్యక్తి నా వెంట పడ్డాడు. పోలీసులే అంత.. మనల్ని ఒకడు వేధిస్తున్నాడని చెప్పిన తర్వాత కూడా పట్టించుకోరు' అని ఆమె ఫర్హా పేర్కొంది. -
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..!
నీలిచిత్రాల తార, హాలీవుడ్ మోడల్ ఫర్రా అబ్రహాం తన పెదాలకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో కష్టాలు వచ్చిపడ్డాయి. ‘అనుకున్నదొకటి... అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. వాస్తవానికి ఫర్రా అబ్రహాం పెదాలు బాగానే ఉంటాయి. కానీ, చిన్నపాటి మార్పు చేస్తే మరింత అందంగా తయారవుతాయని భావించారామె. దానికోసం శస్త్ర చికిత్స చేయించుకున్న ఫర్రాకు చేదు అనుభవమే ఎదురైంది. ఆపరేషన్ తర్వాత పెదాలు లావుగా మారి, అందవిహీనంగా తయారయ్యారు. టీన్ మామ్, 16 అండ్ ప్రెగ్నెంట్, కపుల్స్ థెరపీ టీవీ సిరీస్‌లతో బుల్లితెర తారగా గుర్తింపు పొందిన ఫర్రా ప్రస్తుతం ‘బోచడ్’ అనే టీవీ సిరీస్‌లో నటిస్తున్నారు. సహనటుడు పాల్నాసిఫ్ ఈమె పెదాల పరిస్థితి మునుపటిలా కావడానికి సాయం అందిస్తానని భరోసా ఇచ్చారట. దాంతో ఫర్రా కాస్తంత ఊరట చెందారని సమాచారం.