అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..! | Farrah Abraham '16 & Pregnant' Star: Reaction To Lip Implant Lands Her In ER | Sakshi
Sakshi News home page

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..!

Published Sun, Jan 11 2015 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..!

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..!

నీలిచిత్రాల తార, హాలీవుడ్ మోడల్ ఫర్రా అబ్రహాం తన పెదాలకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో కష్టాలు వచ్చిపడ్డాయి. ‘అనుకున్నదొకటి... అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. వాస్తవానికి ఫర్రా అబ్రహాం పెదాలు బాగానే ఉంటాయి. కానీ, చిన్నపాటి మార్పు చేస్తే మరింత అందంగా తయారవుతాయని భావించారామె. దానికోసం శస్త్ర చికిత్స చేయించుకున్న ఫర్రాకు చేదు అనుభవమే ఎదురైంది. ఆపరేషన్ తర్వాత పెదాలు లావుగా మారి, అందవిహీనంగా తయారయ్యారు. టీన్ మామ్, 16 అండ్ ప్రెగ్నెంట్, కపుల్స్ థెరపీ టీవీ సిరీస్‌లతో బుల్లితెర తారగా గుర్తింపు పొందిన ఫర్రా ప్రస్తుతం ‘బోచడ్’ అనే టీవీ సిరీస్‌లో నటిస్తున్నారు. సహనటుడు పాల్‌నాసిఫ్ ఈమె పెదాల పరిస్థితి మునుపటిలా కావడానికి సాయం అందిస్తానని భరోసా ఇచ్చారట. దాంతో ఫర్రా కాస్తంత ఊరట చెందారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement