Surgical treatment
-
ముక్కు సరి చేయించుకుంటే తప్పేంటి?
రంభ.. ఊర్వశి.. మేనక... ఈ అతిలోక సుందరీమణులు అందానికి కేరాఫ్ అడ్రస్ అంటారు. నిజంగా వీళ్లెలా ఉంటారో ఎవరికీ తెలియకపోయినా బాగా అందంగా ఉండే అమ్మాయిలను వీళ్లతో పోలుస్తారు. అయితే ఎంత గొప్ప అందగత్తెకైనా ఏదో చిన్నపాటి లోపం ఉంటుంది. ఉదాహరణకు ముక్కు సరిగా లేకపోవడమో, పెదాలు లావుగా ఉండటమో... ఇలా అన్నమాట. ఇలాంటి చిన్న లోపాలను చిన్న చిన్న సర్జరీలతో సరి చేయించుకుంటుంటారు. మామూలు అమ్మాయిల సంగతెలా ఉన్నా సినిమా తారల్లో ఇలాంటి కరెక్షన్స్ చేయించుకున్నవాళ్లు ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో కాజల్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘అయితే తప్పేంటి? ఎవరిష్టం వాళ్లది. ఒకవేళ చిన్నపాటి సర్జరీ వల్ల అందం రెట్టింపు అవుతుందంటే చేయించుకోవచ్చు. ఒకరి నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం’’ అన్నారు. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలు పోగొట్టుకోవడానికి కొంతమంది చికిత్స చేయించుకుంటారు కదా? మీరు కూడా అలా చేస్తారా? అనే ప్రశ్న కాజల్ ముందుంచితే – ‘‘లేదు. పెరిగే వయసును ఆనందంగా ఆహ్వానిస్తా. ముడతలు పడితే ఏంటి? అదేం అసహజం కాదు కదా? రెట్టింపు అందం కోసం ఇతరులు శస్త్ర చికిత్స చేయించుకోవడాన్ని నేను వ్యతిరేకించను కానీ, నా మటుకు నేను చేయించుకోను. ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నన్ను అందరూ ఇలానే అంగీకరించాలనుకుంటున్నా’’ అన్నారు. -
ఆస్పత్రుల్లో ఆ‘పరేషాన్’
► ‘మత్తు’ వైద్యులు లేక శస్త్రచికిత్సలకు బ్రేక్ ► ఆపరేషన్ థియేటర్ల ముందు రోగుల పడిగాపులు ► గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లోనూ అదే తీరు సాక్షి, సిటీబ్యూరో: సామాన్య ప్రజలు ఆపద వస్తే దేవుణ్ని.. ఆరోగ్యం పాడైతే వైద్యుణ్ని వేడుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి రోగుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శస్త్ర చికిత్సల్లో అతి ముఖ్యమైన ‘మత్తు’ ఇచ్చే వైద్యులు నగరంలోని ప్రభుత్వాస్పత్రుల్లో లేకపోవడంతో అత్యవసర ఆపరేషన్లు సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓపక్క రోగులు చస్తున్నా ప్రభుత్వం మాత్రం ‘మత్తు’ వీడటం లేదు. రోగుల నిష్పత్తికి తగినంత మంది మత్తు మందు వైద్యులు లేకపోవడంతో అత్యవయసర శస్త్రచికిత్సల కోసం ఆస్పత్ర ుల్లో చేరిన రోగులకు ఆపరేషన్ థియేటర్ల వద్ద చేదు అనుభవమే ఎదురవుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా పడకల సామర్థ్యం, సర్జన్స్, యూనిట్ల సంఖ్యా పెంచారు. అదే స్థాయిలో మత్తు వైద్యుల సంఖ్య మాత్రం పెంచలేదు. క్లిష్టమైన గుండె, మూత్రపిండాలు, కాలేయ, మెదడు, వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్సలే కాదు సాధారణ శస్త్రచికిత్సల కోసం కూడా రోజుల తరబడి ఆస్పత్రిలోనే నిరీక్షించాల్సి వస్తోంది. గత్యంతరం లేక కొంతమంది అక్కడే పడిగాపులు కాస్తుంటే.. మరికొం దరు అప్పుచేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. హే గాంధీ.. సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిని 1998లో వెయ్యి పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పడకల సామర్థ్యాన్ని రెండు వేలకు పెంచారు. ఆపరేషన్ థియేటర్లను 12 నుంచి 31కి పెంచారు. ఇక్కడ రోజుకు సగటున 60-70 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 28 అనస్థీషియన్ పోస్టులకు 17 మంది వైద్యులే సేవలు అందిస్తున్నారు. సర్జన్లు, ఆపరేషన్ థియేటర్ల నిష్పత్తికి తగినంత మంది మత్తుమందు వైద్యులు లేరు. వెంటిలేర్‌పై ఉన్న రోగులు, ఏఎంసీ, ఆర్‌ఐసీయూలోని రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. నిమ్స్‌లోనూ అంతే.. నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు 2300-2500 మంది రోగులు వస్తుంటారు. నిత్యం ఇక్కడ 1200 మంది చికిత్స పొందుతుంటారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 18 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున 30-40 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలా అందరు కలుపుకుని 20 మంది మత్తు మందు వైద్య నిపుణులు ఉన్నారు. ఇక్కడ మరో ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగుల నిష్పత్తికి తగినంత మంది అనస్థీషియన్లు లేకపోవడంతో శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. న్యూరోసర్జరీ, కార్డియో థొరాసిక్, ఆర్థోపెడిక్, మూత్రపిండాలు, క్యాన్సర్ విభాగాల్లో సకాలంలో వైద్య సేవలు అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. ఉస్మానియాలో మరింత దారణం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో రోజుకు సగటున 50 శస్త్రచికిత్సలు జరుగుతాయి. 18 అనస్థీషియన్ పోస్టులకు ఐదు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారిలో కూడా రోజుకు ముగ్గురు, నలుగురు వైద్యులు సెలవుల్లో వెళ్తున్నారు. శస్త్రచికిత్సల సమయంలో అనస్థీషియన్ అందుబాటులోలేక వాయిదా పడుతున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోగం నయం కాకపోగా మరింత ముదురుతోంది. -
సింగపూర్‌కు కెప్టెన్
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ ఆదివారం సింగపూర్‌కు వెళ్లారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఆయన సింగపూర్‌కు వెళ్లడంతో పార్టీ వర్గాలు ఆందోళనలో పడ్డాయి. గత ఏడాది డీఎండీకే అధినేత విజయకాంత్ హఠాత్తుగా సింగపూర్‌కు వెళ్లారు. అయితే, ఆయన కుమారుడు షణ్ముగ పాండియన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సహాబ్దం చిత్రం షూటింగ్ నిమిత్తం వెళ్లినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. రెండు నెలల పాటు గా ఆయన సింగపూర్‌లో షూటింగ్ బిజీలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రెండు నెలల అనంతరం తిరుగు పయనంలో విజయకాంత్ వీల్ చైర్లో ప్రత్యక్షం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన ముఖానికి ముసుగు వేసి మరీ రహస్యంగా కారులో ఎక్కించడంతో అనారోగ్యం బారీన పడ్డట్టు, ఏదో శస్త్ర చికిత్స జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న విజయకాంత్ చివరకు సరికొత్త గెటప్‌తో కన్పించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా, గత నెల అన్ని రాజకీయ పక్షాలను తన వెంట ఢిల్లీకి సైతం తీసుకు వెళ్లారు. కావేరిలో కర్ణాటక నిర్మించ తలబెట్టిన డ్యాంల నిర్మాణాల్ని అడ్డుకునే విధంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రతి పక్ష పార్టీల ప్రతినిధులు తిరుగు పయనం అయినా, విజయకాంత్ మాత్రం ఢిల్లీలో తిష్ట వేశారు. బీజేపీ నేతల్ని, కేంద్ర మంత్రులతో సమావేశాలు కావడంతో తమిళనాట మీడియా చర్చ ఆరంభం అయింది. అలాగే, ఢిల్లీలో మీడియా సమావేశంలో విజయకాంత్ వ్యవహరించిన తీరుపై సెటైర్ల వర్షం కురుస్తూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత మీనంబాక్కం విమానాశ్రయంలో ప్రత్యక్షం అయ్యారు. మీడియా వర్గా లు ఆరా తీశాయి. చివరకు ఉదయం పదకొండు గంటల సమయంలో ఆయన సింగపూర్ ఫ్లైట్ ఎక్కినట్టు తేలింది. మరో మారు హఠాత్తుగా సింగపూర్ పయనానికి ఆయన వెళ్లడంతో కారణాల అన్వేషనలో పడ్డాయి. పార్టీ వర్గాలకు సమాచారం కూడా లేని దృష్ట్యా, ఆరోగ్య సంబంధిత పరీక్షల కోసం ఆయన వెళ్లి ఉంటారా..? అన్న ప్రశ్న బయలుదేరింది. కనీసం తమకు ముందస్తు సమాచారం కూడా విజయకాంత్ ఇవ్వని దృష్ట్యా, ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకునే పనిలో పార్టీ వర్గాలు నిమగ్నం అయ్యాయి. -
వ్యక్తి మూత్రాశయంలో 51 రాళ్లు
పింప్రి, న్యూస్‌లైన్ : పుణే వైద్యులు ఓ యువకుని మూత్రాశయం నుంచి 51 రాళ్లను శస్త్రచికత్స ద్వారా తొలగించారు. పుణేలోని ససూన్ ప్రభుత్వాస్పత్రికి చెందిన వైద్యులు సుధీర్ దుబే, ఆవిష్కార్ బారసే, వైభవ్ షాహ, పాండే విజయ్ పాటిల్‌ల బందం ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు. సంతోష్ హిరవే (21) అనే యువకుడు తరచు మూత్ర సంబంధమైన వ్యాధితో బాధపడుతుండేవాడు. అతనికి తరచుగా తలనొప్పి కూడా వచ్చేదని వైద్యులు చెప్పారు. అతనికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మూత్రాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతనికి శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు. సంతోష్ తల్లి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ శస్త్ర చికిత్స వీరిపై మరింత ఆర్థిక భారాన్ని మోపింది. -
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..!
నీలిచిత్రాల తార, హాలీవుడ్ మోడల్ ఫర్రా అబ్రహాం తన పెదాలకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో కష్టాలు వచ్చిపడ్డాయి. ‘అనుకున్నదొకటి... అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. వాస్తవానికి ఫర్రా అబ్రహాం పెదాలు బాగానే ఉంటాయి. కానీ, చిన్నపాటి మార్పు చేస్తే మరింత అందంగా తయారవుతాయని భావించారామె. దానికోసం శస్త్ర చికిత్స చేయించుకున్న ఫర్రాకు చేదు అనుభవమే ఎదురైంది. ఆపరేషన్ తర్వాత పెదాలు లావుగా మారి, అందవిహీనంగా తయారయ్యారు. టీన్ మామ్, 16 అండ్ ప్రెగ్నెంట్, కపుల్స్ థెరపీ టీవీ సిరీస్‌లతో బుల్లితెర తారగా గుర్తింపు పొందిన ఫర్రా ప్రస్తుతం ‘బోచడ్’ అనే టీవీ సిరీస్‌లో నటిస్తున్నారు. సహనటుడు పాల్నాసిఫ్ ఈమె పెదాల పరిస్థితి మునుపటిలా కావడానికి సాయం అందిస్తానని భరోసా ఇచ్చారట. దాంతో ఫర్రా కాస్తంత ఊరట చెందారని సమాచారం. -
దానిపై ఆలోచనే లేదు
శస్త్ర చికిత్సతో కృత్రిమ అందాల కోసం వెంపర్లాడడం తనకు నచ్చదని, ఆ విషయాన్ని తలచుకుంటేనే తనకు ఎలర్జీ పుడుతుందని కాజల్ అగర్వాల్ పేర్కొంది. అయితే ఇప్పుడు చాలామంది హీరోయిన్లు శస్త్రచికిత్సతో బరువు తగ్గించుకోవడం వంటి కృత్రిమ అందాలతో మెరసి పోతున్నారన్నది వాస్తవం. సీనియర్ నటీమణులు శ్రీదేవి, భానుప్రియ, రంభ, రమ్య నుంచి నేటితరం ప్రముఖ హీరోయిన్లు నయనతార, సమంత, శ్రుతిహాసన్ వరకు కృత్రిమ అందాలను ఆశ్రయించినవారే. అయితే తను మాత్రం సహజ సిద్ధమైన అందాలతో మెరిసిపోతున్నట్టు కాజల్ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ, తాను ఎప్పటికీ శస్త్ర చికిత్సతో అందాన్ని మెరుగుపరచుకునే పని చేయనంది. అలాంటి కృత్రిమ అందాలపై తనకు నమ్మకం లేదని చెప్పింది. అసలు ఆ విషయం గురించి ఆలోచనే తనకు లేదంది. అసలు దాన్ని తలచుకుంటేనే అలర్జీ కలిగేలా ఉందని పేర్కొంది. తన సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి సహజసిద్ధంగా లభించే ప్రకృతి సాధనాలను వాడతానని చెప్పింది. నిత్యం జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసి స్లిమ్ అయి అందాలను పెంచుకుంటానని తెలిపింది. అయితే ఆమె మాటలు ఇతరులను ఎత్తి పొడిచేలా ఉండడంతో పలువురు హీరోయిన్లు కాజల్‌పై గుర్రుగా ఉన్నారని కోలీవుడ్ సమాచారం. -
ఓపిక పట్టాల్సిందే
* ఓపీ విభాగాలలో వైద్య సేవలకు తిప్పలు * శస్త్ర చికిత్సలపై పాక్షిక ప్రభావం * జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభం విశాఖ మెడికల్: ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధవారం జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద సమావేశమై ప్లకార్డులు ప్రదర్శించి మౌన నిరసన చేపట్టారు. పోస్టుగ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ వైద్యులు, హౌస్ సర్జన్లు పెద్ద సంఖ్యలో తొలిరోజు ఓపీ, వార్డు వైద్య సేవలు బహిష్కరించారు. అత్యవసర వైద్య సేవలకు హాజరయ్యారు. కేజీహెచ్‌తో పాటు ప్రభుత్వ విక్టోరియా ప్రసూతి ఆసుపత్రి, ప్రాంతీయ కంటి, ఈఎన్టీ, ఛాతి, అంటువ్యాధులు, ఆర్సీడీ, ప్రభుత్వ మానసిక ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్, వార్డు వైద్య సేవలకు అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటలకే కేజి హెచ్ ఓపికి చేరుకున్నా 10 గంటల వరకు తాళాలు తెరవకపోవడంతో రోగులు బారులు తీరారు. మెడిసిన్ ఓపీ విభాగానికి 11 గంటల వరకు వైద్యులు రాక రోగుల తాకిడి కనిపించింది. 11 గంటల తర్వాత వైద్యులు ఒంటి గంటలోపే రోగులను నిమిషాల్లో చూసి పరీక్షలు రాసి పంపారు. రోగులు మూకుమ్మడిగా ఎక్స్‌రే, క్లినికల్ ల్యాబ్‌కు పోటెత్తారు. వార్డుల్లో రోగులు సకాలంలో చికిత్స అందక అవస్థలు పడ్డారు. ఉదయం ఓపీలో రోగులను చూసిన సర్వీస్ పీజీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్యాహ్నం వార్డులకు వచ్చారు. కార్డియాలజీ, కి డ్నీ, ప్రసూతి, కాలిన గాయాలు, పిల్లల శస్త్ర చికిత్స, న్యూరోసర్జరీ, ఉదరకోస వైద్య విభాగాలు వంటి కీలక వార్డుల్లో రోగులు సకాలంలో చికిత్సలందక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ విక్టోరియా(ఘోషా)ఆసుపత్రిలో గర్భిణులు యాంటీనేటర్ల తనిఖీలు ఆలస్యంగా జరిగాయి. నవజాత శిశు చికిత్స విభాగం(ఎస్ఎన్సీయూ)లో శిశువుల చికిత్సకు అంతరాయం ఏర్పడింది. ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో 28 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్లు, ఎనిమిది మంది హౌస్ సర్జన్లు సమ్మెలో పాల్గొనడంతో ఓపీ రోగులు అవస్థలు పడ్డారు. ఇక్కడ ఐదుగురు సర్వీస్ పీజీలు మాత్రమే విధులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసిన రోగులను సమ్మె కారణంగా నిలిపేశారు. ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి ఓపీ రోగుల తాకిడి ఎక్కువైంది. ఈఎన్టీ, ఆర్సీడీ, మానసిక ఆసుపత్రుల్లో కూడా రోగులు ఇబ్బందులు పడ్డారు. సమ్మె ప్రభావం అనుబంధ ఆసుపత్రుల్లోని తొలి రోజు శస్త్రచికిత్సలపై పాక్షిక ప్రభావం చూపింది. జూనియర్ డాక్టర్ల సంఘం అద్యక్ష కార్యదర్శులు డాక్టర్ షాన్వాజ్, డాక్టర్ నాగచైతన్యలు మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ వైద్యులచే వెట్టిచాకిరీ చేయించుకుంటుందని ఆరోపించారు. మెయిన్ గేటు వద్ద మౌన నిరసనలో ఆంధ్ర వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్, సమన్వయకర్త డాక్టర్ శోభన్, రాజేష్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
స్టెమ్‌సెల్స్‌తో కొత్త రక్తనాళాలు
ప్రయోగాత్మకం లండన్‌లోని శాస్త్రవేత్తలు స్టెమ్‌సెల్స్‌తో ప్రయోగాత్మకంగా నిర్వహించిన శస్త్రచికిత్స సత్ఫలితాలనిచ్చింది. జీర్ణాశయం, పేగుల నుంచి కాలేయానికి రక్తాన్ని సరఫరా చేయాల్సిన నాళాలు లేకపోవడంతో స్టెమ్‌సెల్స్ ద్వారా సేకరించిన రక్తం ఆధారంగా దేహంలో రక్తనాళాలు ఆవిర్భవించేటట్లు చేశారు. కొత్తగా రూపొందిన రక్తనాళాలు కాలేయానికి, జీర్ణాశయానికి మధ్య చక్కగా పని చేస్తున్నాయని ఈ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మిఖాయిల్ ఓల్యూసన్ తెలియచేశారు. స్టెమ్సెల్స్ని భద్రపరుచుకుంటే ఇలాంటి అవసరాలకు ఎముకల నుంచి బోన్‌మ్యారో సేకరించాల్సిన అవసరం ఉండదని కూడా చెప్పారు.