స్టెమ్‌సెల్స్‌తో కొత్త రక్తనాళాలు
ప్రయోగాత్మకం
లండన్‌లోని శాస్త్రవేత్తలు స్టెమ్‌సెల్స్‌తో ప్రయోగాత్మకంగా నిర్వహించిన శస్త్రచికిత్స సత్ఫలితాలనిచ్చింది. జీర్ణాశయం, పేగుల నుంచి కాలేయానికి రక్తాన్ని సరఫరా చేయాల్సిన నాళాలు లేకపోవడంతో స్టెమ్‌సెల్స్ ద్వారా సేకరించిన రక్తం ఆధారంగా దేహంలో రక్తనాళాలు ఆవిర్భవించేటట్లు చేశారు. కొత్తగా రూపొందిన రక్తనాళాలు కాలేయానికి, జీర్ణాశయానికి మధ్య చక్కగా పని చేస్తున్నాయని ఈ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మిఖాయిల్ ఓల్యూసన్ తెలియచేశారు. స్టెమ్‌సెల్స్‌ని భద్రపరుచుకుంటే ఇలాంటి అవసరాలకు ఎముకల నుంచి బోన్‌మ్యారో సేకరించాల్సిన అవసరం ఉండదని కూడా చెప్పారు.