ముక్కు సరి చేయించుకుంటే తప్పేంటి? | Kajal Agarwal nose surgery | Sakshi
Sakshi News home page

ముక్కు సరి చేయించుకుంటే తప్పేంటి?

Published Sat, Jan 7 2017 12:06 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ముక్కు సరి చేయించుకుంటే తప్పేంటి? - Sakshi

ముక్కు సరి చేయించుకుంటే తప్పేంటి?

రంభ.. ఊర్వశి.. మేనక... ఈ అతిలోక సుందరీమణులు అందానికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటారు. నిజంగా వీళ్లెలా ఉంటారో ఎవరికీ తెలియకపోయినా బాగా అందంగా ఉండే అమ్మాయిలను వీళ్లతో పోలుస్తారు. అయితే ఎంత గొప్ప అందగత్తెకైనా ఏదో చిన్నపాటి లోపం ఉంటుంది. ఉదాహరణకు ముక్కు సరిగా లేకపోవడమో, పెదాలు లావుగా ఉండటమో... ఇలా అన్నమాట. ఇలాంటి చిన్న లోపాలను చిన్న చిన్న సర్జరీలతో సరి చేయించుకుంటుంటారు. మామూలు అమ్మాయిల సంగతెలా ఉన్నా సినిమా తారల్లో ఇలాంటి కరెక్షన్స్‌ చేయించుకున్నవాళ్లు ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో కాజల్‌ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘అయితే తప్పేంటి? ఎవరిష్టం వాళ్లది. ఒకవేళ చిన్నపాటి సర్జరీ వల్ల అందం రెట్టింపు అవుతుందంటే చేయించుకోవచ్చు.

ఒకరి నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం’’ అన్నారు. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలు పోగొట్టుకోవడానికి కొంతమంది చికిత్స  చేయించుకుంటారు కదా? మీరు కూడా అలా చేస్తారా? అనే ప్రశ్న కాజల్‌ ముందుంచితే – ‘‘లేదు. పెరిగే వయసును ఆనందంగా ఆహ్వానిస్తా. ముడతలు పడితే ఏంటి? అదేం అసహజం కాదు కదా? రెట్టింపు అందం కోసం ఇతరులు శస్త్ర చికిత్స చేయించుకోవడాన్ని నేను వ్యతిరేకించను కానీ, నా మటుకు నేను చేయించుకోను. ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నన్ను అందరూ ఇలానే అంగీకరించాలనుకుంటున్నా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement