nose surgery
-
సైనస్ లక్షణాలు ఇవే .. సర్జరీ చేసినా తగ్గకపోతే ఏం చేయాలి
-
ముక్కు సర్జరీ వికటించింది.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధన్యత ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెరపై మరింత అందంగా కనిపించేందుకు హీరో,హీరోయిన్లు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. జిమ్‌లో గంటలకొద్దీ వర్కవుట్స్, స్క్రిక్ట్ డైట్..ఇలా ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ అందాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఏకంగా సర్జీరల బాట కూడా పట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు, బోలెడంత మంది హీరోయిన్లు కృత్రిమ పద్దతులను ఉపయోగించి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వారిలో కొందరు సర్జరీ తర్వాత మరింత అందంగా తయారైతే, మరికొందరికి ఆ సర్జరీలు వికటించి ఉన్న అందం పోగోట్టుకున్నారు. గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే ముక్కు సర్జరీ మాత్రం వికటించి డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే ఒప్పుకుంది. ఇటీవల ఓ షోకు హాజరైన ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ''ఇది జరిగి సుమారు 20ఏళ్లవుతుంది. ఒకానొక సమయంలో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. జలుబు కూడా చాలాకాలం వరకు తగ్గలేదు. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే నాసికా కుహరంలో పాలిప్‌ను తొలగించాలని సిఫార్సు చేశారు. అయితే అనుకోకుండా ముక్కు పైన ఉన్న చిన్న భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో నా ముఖం అంతా మారిపోయింది. అప్పటికే నేను కొన్ని సినిమాలు సైన్ చేశాను. కానీ నా ముఖంలో సర్జరీ తాలూకూ మార్పులు స్పష్టంగా తెలిసిపోయి కాస్త అందవిహీనంగా తయారయ్యాను. దీంతో నన్ను 3 సినిమాల్లో తీసేశారు. అంతేకాకుండా ఓ సినిమాలో హీరోయిన్ రోల్‌కు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాల్సి వచ్చింది. ఇలా చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ పోతున్న సమయంలో చాలా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. కెరీర్ ముగుస్తుందని చాలా బాధపడ్డాను. అప్పుడు మా నాన్న నాకు అండగా నిలిచారు. ముక్కును కరెక్ట్ చేసుకునేందుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకోమని నన్ను ప్రోత్సహించారు. అలా మళ్లీ ఆ సర్జరీతో కాన్ఫిడెన్స్ వచ్చింది'' అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. -
అందంగా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్!
టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు, అందం కూడా కావాలి. నటిగా, హీరోయిన్గా ఎదగాలంటే కాస్తోకూస్తో అందం, ఆకర్షణ ఉండాలి. ఇందుకోసం సెలబ్రిటీలు డైట్, ఎక్సర్సైజ్, యోగాలంటూ నానాతంటాలు పడతారు. కానీ కొంతమంది ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఆ జాబితాలో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఆత్మకథ 'అన్ఫినిష్డ్'లో రాసుకొచ్చింది. 'డాక్టర్ నా ముక్కును సర్జరీ చేసే క్రమంలో కాస్త పట్టు కోల్పోయాడు. దీంతో నా ముక్కు ఆకారమే మారిపోయింది. బ్యాండేజీ తొలగించగానే నా ముక్కు చూసి అమ్మ, నేను భయపడిపోయాము. అది వంకరగా మారిపోయి నా ముఖమే మరోలా కనిపించింది. అసలు నేను నేనులానే లేను. అద్దంలో చూసుకున్నప్పుడు వేరే ఎవరో నన్ను చూస్తున్నట్లుండేది. నిస్సహాయురాలిగా ఉండిపోయాను. నా ఆత్మగౌరవం మంటగలిసిపోయినట్లైంది. తిరిగి కోలుకుంటాననుకోలేదు' అని రాసుకొచ్చింది. కాగా ప్రియాంక చోప్రా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అందంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేదని, ఈ క్రమంలోనే తను సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వచ్చాయి. అయితే సర్జరీ సక్సెస్ కాకపోవడంతో అందవిహీనంగా మారిన ముక్కును తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు మళ్లీ సర్జరీలు చేయించుకోలేక తప్పలేదట! -
అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా : హీరోయిన్
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌కి పెద్దపీట వేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందంగా కనిపించడానికి హీరో, హీరోయిన్లు తెగ కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందాన్ని పెంచుకోవడం కోసం కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారిలో శ్రుతిహాసన్ కూడా ఒకరు. కమల్‌హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన శ్రుతిహాసన్ తన ప్లాస్టిక్ సర్జరీపై స్పందించింది. 'అవును.. నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. నా శరీరంలో ముక్కు అంటే నాకు ఎక్కువ ఇష్టం. అది కాస్త వంకరగా ఉండేది. దానివల్ల చాలా బాధపడ్డాను. అందుకే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా. దానికోసం ఎక్కువ ఖర్చుపెట్టాను. అయినా ఇది నా శరీరం. దీనిని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది' అంటూ చెప్పుకొచ్చింది. -
పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ
దక్షిణాదిలో ప్రస్తుతం పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఆమె. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాలతో పూ కెరీర్లో దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్‌లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే పూజకు సంబంధించి ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో! తన అందాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ ‘బుట్టబొమ్మ’ ముక్కుకు సర్జరీ చేసుకునేందుకు సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆమె ఇటీవలె విదేశాలకు వెళ్లిందని అంటుండగా.. మరోవైపు సర్జరీ కూడా చేయించుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై ఆమె టీం స్పందించింది. పూజా సర్జరీ చేసుకుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని వట్టి పుకార్లేనని స్పష్టం చేసింది. హాలిడే వెకేషన్లో భాగంగానే ఆమె విదేశాలకు వెళ్లిందని, పూజ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని ఆమె టీం పేర్కొంది. కాగా పూజా ప్రస్తుతం మహేశ్ బాబు-త్రివిక్రమ్ SSMB28 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ముక్కు రంధ్రంలో దంతాలు! షాక్ అయిన డాక్టర్లు!
Patient's Symptoms Of Nasal Obstruction: ఇంతవరకు రోగులకు జరిగిన అరుదైన శస్త్ర చికిత్సలు గురించి విన్నాం. శ్వాస కోస సమస్య అనేది చాలామందికి ఎదురై సమస్య. ఆస్మా వంటి సమస్యలున్నవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది. కానీ ఇక్కడోక వ్యక్తి తనకి అందరిలానే శ్వాసకోస సమస్య ఉందని డాక్టర్ని సంప్రదించాడు. అయితే ఆ తర్వాత విషయం తెలుసుకుని ఆ వ్యక్తే కాదు డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. అసలు విషయంలోకెళ్తే..ఇంగ్లాండ్‌కి చెందిన 38 ఏళ్ల వ్యక్తి గత కొన్ని రోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అతను శ్వాస సమస్యతో బాధపడుతున్నాని చెప్పడంతో ఆ వ్యక్తికి డాక్టర్లు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తి నాసికా రంధ్రంలో దంతం పెరుతున్నట్లు తెలుసుకుని డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అతని ముఖకవళికలు సాధారణంగానే ఉన్నాయి కానీ ఈ దంతం ఎలా నాసికా రంధ్రంలో పెరుగుతుందనేది మొదట వారికి అర్థం కాలేదు. అయితే డాక్టర్లు కేసుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎక్టోపిక్ దంతాలు పెరుగుతున్నట్లు నిర్థారించారు. ఎక్టోపిక్ అంటే అసాధారణంగా పెరగడం. కొంతమందిలో దంతాలు ఎగుడు దిగుడుగా పెరిగినట్లు అతనికి ముక్కు రంధ్రంలోకి చోచ్చుకుపోయి పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఆ దంతం అతని కుడి రంధ్రంలో పెరుగుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి ఇంట్రానాసల్ విధానం ద్వారా నోటికి సంబంధించిన ఓటోలారింగోలాజిక్ శస్త్రచికిత్స చేసి నాసికా రంధ్రం నుంచి పంటిని తొలగించారు. ఆ దంతం సుమారు 14 మి.మీటర్ల పొడవు ఉంది. మూడు నెలలు తదనంతరం అతను శ్వాసకోస సమస్య నుంచి బయటపడినట్లు డాక్టర్లు వెల్లడించారు. (చదవండి: ఆకాశంలో ఒక వింత!..అదేంటో అంతు చిక్కని రహస్యం!) -
సెల్ఫీ కోసం ముక్కు కోసుకుంటున్నారు!
వాషింగ్టన్: ఇప్పుడు చాలా మందికి సెల్ఫీలు తీసుకోవడమంటే మహా సరదా. ఈ సెల్ఫీల పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఫొటోల్లో తమ ముక్కు పెద్దదిగా కనిపిస్తోందనీ, శస్త్రచికిత్స ద్వారా దాని పరిమాణాన్ని తగ్గించాలంటూ ప్లాస్టిక్ సర్జన్ల దగ్గరకు అనేకమంది వరుసలు కడుతున్నారు. సెల్ఫీ ఫొటో తీసుకునేటప్పుడు ఫోన్‌ను ముఖానికి దగ్గరగా పెట్టాల్సి రావడం వల్లనే ముక్కు అలా కనిపిస్తోంది తప్ప వాస్తవానికి సమస్యేమీ లేదని వైద్యులు చెబుతున్నా వారు వినడం లేదు. దీంతో ప్లాస్టిక్ సర్జన్లకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికాలోని ప్లాస్టిక్ సర్జన్ల పత్రిక ‘జామా ఫేషల్ ప్లాస్టిక్ సర్జరీ’ ఇటీవల ప్రచురించింది. 30 శాతం పెద్దదిగా కనిపిస్తుంది.. ముఖానికి కెమెరా లెన్స్ 12 అంగుళాల కంటే తక్కువ దూరంలో ఉంటే సెల్ఫీల్లో ముక్కులు అసలు సైజు కన్నా 30 శాతం పెద్దగా కనిపిస్తాయి. ఇది గమనించకుండా అనేక మంది ఆపరేషన్ చేసి తమ ముక్కును అందంగా తీర్చిదిద్దాలంటూ తన క్లినిక్ వచ్చి అడుగుతున్నారని అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీలో పనిచేసే ఫేషల్ ప్లాస్టిక్ సర్జన్ బోరిస్ పాష్కోవర్ తెలిపారు. ఈయన తన సహచరులతో కలసి రాసిన వ్యాసాన్నే జామా ఫేషల్ ప్లాస్టిక్ సర్జరీ ప్రచురించింది. అమెరికన్ ఫేషల్ ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జన్ల అకాడమీ ప్రజల్లో కనిపిస్తున్న ఈ వేలం వెర్రిని గమనించింది. సెల్ఫీల్లో అందంగా కనిపించేలా చేయాలంటూ అనేక మంది తమను కలుస్తున్నారని 2017లో జరిపిన ఓ సర్వేలో 55 శాతం ఫేషల్ ప్లాస్టిక్ సర్జన్లు చెప్పారు. ‘సెల్ఫీల్లో ముక్కు పెద్దదిగా కనిపిస్తోందంటూ అనేకులు నా దగ్గరకు వస్తున్నారు. వారి ముక్కు పెద్దగా ఏమీ లేదనీ, కెమెరాను దగ్గరగా ఉంచి సెల్ఫీ తీయడం వల్లే పరిమాణంలో పెద్దగా కనిపిస్తోందని చెబుతున్నాను’ అని తెలిపారు. కెమెరాను దూరంగా పెడితే ముక్కు సైజు తగ్గుతుందని ఆయన వెల్లడించారు. -
ముక్కు సరి చేయించుకుంటే తప్పేంటి?
రంభ.. ఊర్వశి.. మేనక... ఈ అతిలోక సుందరీమణులు అందానికి కేరాఫ్ అడ్రస్ అంటారు. నిజంగా వీళ్లెలా ఉంటారో ఎవరికీ తెలియకపోయినా బాగా అందంగా ఉండే అమ్మాయిలను వీళ్లతో పోలుస్తారు. అయితే ఎంత గొప్ప అందగత్తెకైనా ఏదో చిన్నపాటి లోపం ఉంటుంది. ఉదాహరణకు ముక్కు సరిగా లేకపోవడమో, పెదాలు లావుగా ఉండటమో... ఇలా అన్నమాట. ఇలాంటి చిన్న లోపాలను చిన్న చిన్న సర్జరీలతో సరి చేయించుకుంటుంటారు. మామూలు అమ్మాయిల సంగతెలా ఉన్నా సినిమా తారల్లో ఇలాంటి కరెక్షన్స్ చేయించుకున్నవాళ్లు ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో కాజల్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘అయితే తప్పేంటి? ఎవరిష్టం వాళ్లది. ఒకవేళ చిన్నపాటి సర్జరీ వల్ల అందం రెట్టింపు అవుతుందంటే చేయించుకోవచ్చు. ఒకరి నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం’’ అన్నారు. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలు పోగొట్టుకోవడానికి కొంతమంది చికిత్స చేయించుకుంటారు కదా? మీరు కూడా అలా చేస్తారా? అనే ప్రశ్న కాజల్ ముందుంచితే – ‘‘లేదు. పెరిగే వయసును ఆనందంగా ఆహ్వానిస్తా. ముడతలు పడితే ఏంటి? అదేం అసహజం కాదు కదా? రెట్టింపు అందం కోసం ఇతరులు శస్త్ర చికిత్స చేయించుకోవడాన్ని నేను వ్యతిరేకించను కానీ, నా మటుకు నేను చేయించుకోను. ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నన్ను అందరూ ఇలానే అంగీకరించాలనుకుంటున్నా’’ అన్నారు. -
సంజయ్‌కు 30 రోజుల పెరోల్!
-
సంజయ్‌కు 30 రోజుల పెరోల్!
ముంబయి: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా యేర్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది. దత్‌కు ఇప్పటివరకు మూడుసార్లు పెరోల్ మంజూరుకాగా.. మరోసారి కూడా ఇచ్చారు. సంజయ్ కుమార్తె ముక్కుకు శస్త్ర చికిత్స చేయనున్న నేపథ్యంలో ఆమె మంచి చెడులు చూసుకునే ఉద్దేశంతో పెట్టుకున్న పెరోల్ బెయిల్‌కు తాజాగా కోర్టు అనుమతించింది. 30 రోజులపాటు సంజయ్ దత్ పెరోల్‌పై జైలు వెలుపల ఉండనున్నారు. దత్ 1993లో ముంబయిలో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఖైదీగా ఉన్నారు. ఆయనకు తరుచూ పెరోల్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ గతంలో కొందరు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇలాగే ఆయనకు పెరోల్ ఇచ్చుకుంటూ వెళితే ఇతర ఖైదీలు కూడా పెరోల్ మంజూరుచేయాలని డిమాండ్ చేసే ప్రమాదం ఉందని ఆ పిల్లో హెచ్చరించారు. -
నాకు అసలే ‘ముక్కు’ మీద కోపం!
‘‘మరోసారి నా ముక్కుమీద కామెంట్లు చేశారో జాగ్రత్త. నాకసలే ముక్కు మీదే ఉంటుంది కోపం’’ అంటూ చెన్నయ్‌లోని ఓ కార్యక్రమంలో అక్కడి మీడియా వారిపై సమంత అంతెత్తున లేచారు. ఇంతకీ సమంతకు అంత కోపం ఎందుకొచ్చిందా అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే - ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో సమంత బాధ పడుతోందని మీడియాలో వార్తలు రావడం పరిపాటైపోయింది. అంతకు ముందు ఆమె చర్మవ్యాధితో బాధపడుతోందని మీడియాలో పలు కథనాలొచ్చాయి. అది మరువకముందే... సమంత ముక్కుకు గాయమైందనీ, దాంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని మరికొన్ని కథనాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో వార్త ఆమెపై హల్చల్ చేయడం మొదలైంది. అదే... ‘ముక్కుకు సర్జరీ’. గతంలో జరిగిన ప్రమాదం వల్ల ఆమె ముక్కుకు ఓ సారి సర్జరీ జరిగిందనీ, అందుకే ముక్కు ఆకారంలో మార్పు వచ్చిందనీ, మళ్లీ పూర్వాకారంలోకి ముక్కును తీసుకురావడానికి మరో సర్జరీ అవసరం అనీ, అందుకే ప్లాస్టిక్ సర్జరీ నిమిత్తం సమంత లండన్ వెళ్తున్నారనీ మరో కథనం చెన్నయ్ మీడియాలో షికారు చేస్తోంది. ఇది ఇలా ఉంటే... చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సమంతతో అక్కడి మీడియా ఈ విషయంపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘‘నా ముక్కు బ్రహ్మాండంగా ఉంది. పైగా నాది అందమైన ముక్కు. దానిపై కత్తి పెట్టించుకోవాల్సిన అవసరం ఏంటి నాకు? ఇలాంటి వార్తల్ని ఇప్పటికైనా ఆపితే మంచిది. నాకసలే ముక్కుమీదే ఉంటుంది కోపం’’ అంటూ చిరుబుర్రులాడారు.