సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌కి పెద్దపీట వేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందంగా కనిపించడానికి హీరో, హీరోయిన్లు తెగ కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందాన్ని పెంచుకోవడం కోసం కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారిలో శ్రుతిహాసన్ కూడా ఒకరు.
కమల్‌హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన శ్రుతిహాసన్ తన ప్లాస్టిక్ సర్జరీపై స్పందించింది.
'అవును.. నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. నా శరీరంలో ముక్కు అంటే నాకు ఎక్కువ ఇష్టం. అది కాస్త వంకరగా ఉండేది. దానివల్ల చాలా బాధపడ్డాను. అందుకే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా. దానికోసం ఎక్కువ ఖర్చుపెట్టాను. అయినా ఇది నా శరీరం. దీనిని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది' అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment