హృదయ తలుపు మూసేశా.. బ్రేకప్‌ సాంగ్‌ పాడిన శృతిహాసన్‌ | 'I Shut The Door': Shruti Haasan Shares Cryptic Post | Sakshi
Sakshi News home page

Shruti Haasan: నా మనసుకు తాళం వేశా.. ఎవరికీ చోటు లేదంటూ బ్రేకప్‌ బాధతో..

Published Thu, May 30 2024 1:31 PM | Last Updated on Thu, May 30 2024 1:39 PM

'I Shut The Door': Shruti Haasan Shares Cryptic Post

‘నా డోర్స్‌ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని హీరోయిన్‌ శృతిహాసన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వారసురాలైన ఈమె తన తండ్రి నటించిన హేరామ్‌ చిత్రంతో బాల నటిగా రంగప్రవేశం చేశారు. 2009లో లక్‌ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2011లో 7 ఆమ్‌ అరివు (సెవన్త్‌ సెన్స్‌) చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

తెలుగులో ఎక్కువ సక్సెస్‌
అయితే ఆ తరువాత నుంచి శృతిని తమిళ సినీ పరిశ్రమ కంటే తెలుగు సినీ పరిశ్రమే ఎక్కువగా ఆదరిస్తూ వస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌బాబు, రవితేజ, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్నారు. ఇటీవల సలార్‌తో సక్సెస్‌ అందుకోగా ఇనిమేల్‌ అనే ప్రైవేట్‌ ఆల్బమ్‌లో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు కూతురిగా నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

మింగిల్‌ అవ్వాలనుకోవడం లేదు
ఇకపోతే శృతిహాసన్‌కు ప్రేమ అచ్చిరాలేదనుకుంటా.. ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో విఫలం అయిన శృతిహాసన్‌ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడికి బ్రేకప్‌ చెప్పిందని సమాచారం. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌నే అని.. మింగిల్‌ అవ్వాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తాజాగా ‘ఐ షట్‌ ద డోర్‌. అండ్‌ ఐ ఈట్‌ ద కీ. ఐ వోంట్‌ బీ నీడింగ్‌ దట్‌ మీ ఎనీమోర్‌’ అంటూ ప్రేమలో ఓడిపోయిన వారు పాడుకునేలాంటి పాటను పోస్ట్‌ చేశారు. హృదయ తలుపులు మూసేశానని, ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదని శృతి హాసన్‌ పాట రూపంలో పాడుతుందన్నమాట!

 

 

చదవండి: పోలీసులతో హీరోయిన్‌ గొడవ.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement