కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్‌ .. వీడియో వైరల్‌ | Shruti Haasan Learning Karrasamu Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్‌ .. ఎందుకో తెలుసా..?

Published Sun, Sep 1 2024 9:43 AM | Last Updated on Sun, Sep 1 2024 2:56 PM

Shruti Haasan Learn karrasamu Video Viral

ఇంతకు ముందు సినీ హీరోలు తాము నటించే చిత్రాల కోసం తీవ్రంగా హోమ్‌వర్క్‌ చేస్తుండేవారు. అయితే, ఇప్పుడు హీరోయిన్లు కూడా తమ పాత్రల కోసం భారీగానే కసరత్తులు  చేస్తున్నారు. తాజాగా నటి శృతిహాసన్‌ తన పాత్రకు న్యాయం చేయడం కోసం చాలా కష్టపడుతుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో రాణిస్తున్న ఈ చెన్నై బ్యూటీ మొదట హిందీలో లక్‌ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో నటిస్తూ పాపులర్‌ అయింది. నిజం చెప్పాలంటే తమిళంలో కంటే తెలుగులోనే శృతిహాసన్‌కు మంచి క్రేజ్‌ ఉంది. 

తెలుగులో ఈమె నటించిన చిత్రాలన్నీ హిట్టే అని చెప్పవచ్చు. అలా  టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న శృతిహాసన్‌ తన సొంత భాష తమిళంలో నటించి మూడేళ్లకు పైగా అయ్యింది. ఈమె నాయకిగా నటించిన తమిళ చిత్రం లాభం తెరపైకి వచ్చి మూడేళ్లు అయ్యింది. అలా సుదీర్ఘ గ్యాప్‌ తరువాత శృతిహాసన్‌ కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం కూలీ. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ తారాగణంతో  భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో శృతిహాసన్‌ నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు ఒక పోస్టర్‌ను విడుదల చేశాయి కూడా. 

ఇందులో ఆమె పాత్ర చాలా శక్తివంతమైనదిగా తెలుస్తోంది. చిత్రంలో ఆమెకు ఫైట్‌ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అందుకోసం ఆమె ఆత్మరక్షణ విద్య అయిన కర్రసాములో శిక్షణ పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయో సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అందులో ఆమె తన తండ్రి, ప్రఖ్యాత నటుడు కమలహాసన్‌ కూడా ఇంతకు ముందు దేవర్‌మగన్‌ (క్షత్రియ పుత్రుడు) చిత్రంలో కర్రసాము విద్యను ప్రదర్శించారని, అలాగే తానూ ఈ ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈమె వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement