
సాధారణంగా దీపావళి పర్వదినం ప్రజల్లో నూతనోత్సాహాన్ని, కాంతులను విరజిమ్ముతుంది. అయితే ఈ దీపావళి ఈ ప్రేమ జంటలో వెలుగు తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. స్వేచ్ఛ అనే పదానికి మారుపేరు శృతిహాసన్. ఈమె పెరిగిన వాతావరణం అలాంటిది. తండ్రి కమలహాసన్ తమకు స్వేచ్ఛ కల్పించారని ధైర్యంగా చెప్పే శృతిహాసన్ నటిగానూ ప్రత్యేక ముద్ర వేసుకుంది.
ఇంకా చెప్పాలంటే తమిళ నటి ఐనా తెలుగులోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది. హీరో ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం సలార్‌లో నటించిన శృతిహాసన్ ఆ చిత్రం అందించే రిజల్ట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారం సాగిస్తోంది. గతంలో ఇద్దరికి బ్రేకప్ చెప్పిన శృతిహాసన్ తాజాగా శాంతను హజారిక అనే విజువల్ ఆర్టిస్ట్‌తో ప్రేమలో పడింది.
తాజాగా దీపావళి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ శృతి హాసన్ తన ప్రియుడు శాంతను హజారికకు ప్రేమతో ముద్దులు పెట్టిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో వీరిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లెప్పుడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
చదవండి: ఐశ్వర్య రాయ్‌పై రజాక్ అసభ్యకరమైన మాటలు.. ఫైర్ అవుతున్న ఇండియన్స్
Comments
Please login to add a commentAdd a comment