
శ్రుతి హాసన్.. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయిక. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఖాళీ సమయం దొరికితే మాత్రం ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంటుందీ ముద్దుగుమ్మ. అయితే దొరికిందే సందనుకునే కొందరు నెటిజన్లు చిత్రవిచిత్ర ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెడుతుంటారు. ఒకవేళ ఆమె ఆన్సర్ ఇవ్వలేదంటే గూగుల్ తల్లిని పదేపదే అడుగుతూ సమాధానాలు రాబడుతుంటారు. తాజా ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్.. తన గురించి గూగుల్‌లో ఎక్కువగా ఆరా తీసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
అందులో భాగంగా ఆమె ఫోన్ నంబర్ అడగ్గా.. 100 అని ఇంతకుముందు కూడా చెప్పానుగా అని బదులిచ్చింది. రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. 'ఓహ్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసు.. శ్రుతి హాసన్ ప్రియుడు శాంతను హజారిక ఎవరు? ఇదేగా.. ఎందుకంటే దీన్ని నేను గూగుల్ చేశాను. అక్కడ కనిపించిన మిగతా ప్రశ్నల పరంపరను చూసి తెగ నవ్వుకున్నాను. ఇంతకీ నా ఆన్సరేంటంటే, అవును, నేను డేటింగ్ చేస్తున్నాను' అని తెలిపింది శ్రుతి హాసన్. 'నీ ఆస్తి మొత్తం ఎంతుంటుంది?' అన్న ప్రశ్నకు 'శ్రుతి హాసన్ దాన్ని కనుగొనే పనిలోనే ఉంది, కానీ తను అదింకా పెరగాలనుకుంటోంది' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment