Actress Pooja Hegde Team Rubbishes Cosmetic Surgery Rumors - Sakshi
Sakshi News home page

Pooja Hegde Surgery: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ

Oct 3 2022 9:58 AM | Updated on Oct 3 2022 12:21 PM

Pooja Hegde Team Denied Rumours Of Her Cosmetic Surgery - Sakshi

దక్షిణాదిలో ప్రస్తుతం పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌లో దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఆమె. వరుస ఆఫర్లు, పాన్‌ ఇండియా చిత్రాలతో పూ కెరీర్‌లో దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే పూజకు సంబంధించి ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చదవండి: మహేశ్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో మలయాళ స్టార్‌ హీరో!

తన అందాన్ని మరింత  మెరుగుపరుచుకునేందుకు ఈ ‘బుట్టబొమ్మ’ ముక్కుకు సర్జరీ చేసుకునేందుకు సిద్ధమైందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆమె ఇటీవలె విదేశాలకు వెళ్లిందని అంటుండగా.. మరోవైపు సర్జరీ కూడా చేయించుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై ఆమె టీం స్పందించింది. పూజా సర్జరీ చేసుకుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని వట్టి పుకార్లేనని స్పష్టం చేసింది. హాలిడే వెకేషన్లో భాగంగానే ఆమె విదేశాలకు వెళ్లిందని, పూజ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని ఆమె టీం పేర్కొంది. కాగా పూజా ప్రస్తుతం మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ SSMB28 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement