దానిపై ఆలోచనే లేదు | i don't think on Surgical treatment says kajal aggarwal | Sakshi
Sakshi News home page

దానిపై ఆలోచనే లేదు

Published Wed, Dec 24 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

దానిపై ఆలోచనే లేదు

దానిపై ఆలోచనే లేదు

శస్త్ర చికిత్సతో కృత్రిమ అందాల కోసం వెంపర్లాడడం తనకు నచ్చదని, ఆ విషయాన్ని తలచుకుంటేనే తనకు ఎలర్జీ పుడుతుందని కాజల్ అగర్వాల్ పేర్కొంది. అయితే ఇప్పుడు చాలామంది హీరోయిన్లు శస్త్రచికిత్సతో బరువు తగ్గించుకోవడం వంటి కృత్రిమ అందాలతో మెరసి పోతున్నారన్నది వాస్తవం. సీనియర్ నటీమణులు శ్రీదేవి, భానుప్రియ, రంభ, రమ్య నుంచి నేటితరం ప్రముఖ హీరోయిన్లు నయనతార, సమంత, శ్రుతిహాసన్ వరకు కృత్రిమ అందాలను ఆశ్రయించినవారే. అయితే తను మాత్రం సహజ సిద్ధమైన అందాలతో మెరిసిపోతున్నట్టు కాజల్ పేర్కొన్నారు.
 
 ఆమె మాట్లాడుతూ, తాను ఎప్పటికీ శస్త్ర చికిత్సతో అందాన్ని మెరుగుపరచుకునే పని చేయనంది. అలాంటి కృత్రిమ అందాలపై తనకు నమ్మకం లేదని చెప్పింది. అసలు ఆ విషయం గురించి ఆలోచనే తనకు లేదంది. అసలు దాన్ని తలచుకుంటేనే అలర్జీ కలిగేలా ఉందని పేర్కొంది. తన సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి సహజసిద్ధంగా లభించే ప్రకృతి సాధనాలను వాడతానని చెప్పింది. నిత్యం జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసి స్లిమ్ అయి అందాలను పెంచుకుంటానని తెలిపింది.   అయితే ఆమె మాటలు ఇతరులను ఎత్తి పొడిచేలా ఉండడంతో పలువురు హీరోయిన్లు కాజల్‌పై గుర్రుగా ఉన్నారని కోలీవుడ్  సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement