మోడల్‌ను ఎత్తుకుని ముద్దుపెట్టిన హీరో, సిగ్గు లేదంటూ ట్రోలింగ్!
రిలయన్స్ అధినేత ముఖేవ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్ఎంఏసీసీ)ని ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే! ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలే కాకుండా సినీ, క్రీడా ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ఈ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవ రెండో రోజు కూడా పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్‌లతో స్టేజీని హోరెత్తించారు.
ఈ క్రమంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ హాలీవుడ్ మోడల్ గిగి హ్యాడిడ్ను ఎత్తుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా చాలామంది హీరో వైఖరిని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. 'గిగి చాలా అసౌకర్యంగా ఫీలైంది', 'అతను అలా చేసి ఉండాల్సింది కాదు', 'బాలీవుడ్‌కు సిగ్గులేకుండా పోతోంది' అంటూ ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా ఈ ట్రోలింగ్‌పై వరుణ్ ధావన్ స్పందించాడు. 'మిమ్మల్ని మేల్కొపాలనుకుంటున్నాను. గిగిని స్టేజీపై ఎత్తుకుని ముద్దుపెట్టడం అనేది మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఇక మామీద రచ్చ చేయడం ఆపి మీ పని చూసుకోండి' అని స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. దీనిపై వరుణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. అనవసరంగా మా హీరో మీద పడి ఏడ్చారు కదరా అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఎన్ఎంఏసీసీ లాంఛింగ్ కార్యక్రమంలో ప్రియాంక - రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీని దద్దరిల్లిపోయేలా చేశారు. రష్మిక మందన్నా, ఆలియా భట్ అయితే నాటునాటు స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హాలీవుడ్ సెలబ్రిటీలు లా రోచ్, టామ్ హాలాండ్, జెండాయా సహా పలువురు తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
I guess today you woke up and decided to be woke. So lemme burst ur bubble and tell u it was planned for her to be on stage so find a new Twitter cause to vent about rather then going out and doing something about things . Good morning 🙏 https://t.co/9O7Hg43y0S
— VarunDhawan (@Varun_dvn) April 2, 2023
Yes exactly Gigi Hadid 🥰 THAT would have been my reaction too if Varun lifted me up and danced with him for 5 secs. pic.twitter.com/ExfCE3CaJK
— Annesha (@ApnaaVarun) April 2, 2023