బ్రిస్బేన్ : భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్‌కు ముందే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు. ఓవరనైట్ ఆటగాళ్లు పైన్, కామెరూన్ గ్రీన్‌లు ఆకట్టుకున్నారు.(పంత్ మొత్తుకున్నా నమ్మలేదు..)
ఈ జోడి 98 పరుగులు జోడించారు. ఆరో వికెట్‌గా పైన్ ఔటైన తర్వాత ఆసీస్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లలో స్టార్క్ 20 పరుగులతో అజేయంగా నిలవగా, లయన్ 24 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్‌కు వికెట్ దక్కింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సిరీస్ సమానంగా ఉన్నాయి.చివరి టెస్ట్‌లో ఎవరి గెలిస్తే వారికే సిరీస్ దక్కుతుంది. దీంతో నాలుగో టెస్టులో గెలుపు కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment