
ఆడుకోవటానికి సరదాగా ఒక్కచోటికి చేరిన స్నేహితులకు భయానక అనుభవం ఎదురైంది. ఆట మధ్యలో పూల్ టేబుల్ కింద అనుకోని అతిథి వారిని పలకరించింది. బోర్డు పాకెట్‌లో పడిన బాల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అందులో నుంచి కొండచిలువ తల దర్శనమిచ్చింది. దీంతో బెంబేలెత్తిపోయిన ఆటగాళ్లు పాములు పట్టేవారికి సమాచారమిచ్చారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బిస్బేన్ స్నేక్ క్యాచర్స్ కొండచిలువను బయటికి తీశారు. ‘ స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటున్న సమయంలో ముచ్చటగొలిపే పాము తల కనిపిస్తే ఎలా ఉంటుంది’ అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను... ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.