
టీ20 వరల్డ్‌కప్ కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. మరికొద్ది గంటల్లో మహా సంగ్రామం మొదలుకానుంది. వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఇవాళ బ్రిస్బేన్ నగరంలో ల్యాండయ్యింది. అక్టోబర్ 17, 19 తేదీల్లో రోహిత్ సేన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను ఢీకొట్టనుంది. భారత ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌లో హుషారుగా కనిపించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
Touchdown Brisbane 📍#TeamIndia pic.twitter.com/HHof4Le3mP
— BCCI (@BCCI) October 15, 2022
ఇందులో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు నవ్వుతూ, ఫోటోలకు ఫోజులిస్తూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా జట్టు మొత్తం బిస్బేన్‌కు చేరుకుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనే 16 జట్ల కెప్టెన్లతో ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యేందుకు రోహిత్ మెల్‌బోర్న్‌కు వెళ్లాడు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు రేపటి (అక్టోబర్ 16) నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలుకానుండగా.. సూపర్-12 మ్యాచ్‌లు ఈనెల 22 నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 23న భారత్.. తమ తొలి సమరంలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆతర్వాత 27న గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో, 30న సౌతాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో, నవంబర్ 6న గ్రూప్-బిలో తొలి స్థానంలో ఉన్న జట్లతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment