
దుబాయ్: ఇప్పుడైతే భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఆడుతున్నారు. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు కలిసి కట్టుగా, భారత జట్టుగా రోహిత్ శర్మ బృందం ఏకైక వార్మప్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశ పోటీలన్నీ అమెరికాలోనే షెడ్యూల్ చేశారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అక్కడే ఆడుతుంది.
అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. పోటీపడే మొత్తం 20 జట్లలో 17 జట్లు మే 27 నుంచి జూన్ 1 వరకు వార్మప్‌లో పాల్గొంటుండగా... డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్‌లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే నేరుగా టోర్నీలోనే బరిలోకి దిగనున్నాయి.
ఈ మూడు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల వల్లే బహుశా వార్మప్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment